Mohammed Siraj: మిడిల్ క్లాస్ నుంచి వచ్చాం.. అందుకే మనలో ఇంత ఫైర్..
తాజాగా విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సిరాజ్‌ని ప్రశంసించింది. అనుష్క శర్మ తన ఇంస్టాగ్రామ్ వేదికగా “క్యా బాత్ హై మియాన్! మేజిక్!!” సిరాజ్ అంటూ పోస్ట్ చేసింది. సిరాజ్ ఇంత అగ్రెస్సివ్‌గా ఉండటానికి విరాట్ కోహ్లీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Mohammed Siraj: 2023 ఆసియా కప్ ఫైనల్ అంటే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు మహమ్మద్ సిరాజ్. ఈ మ్యాచులో ఆరు వికెట్లు తీసిన ఈ హైదరాబాదీ ఫాస్ట్ బౌలర్ శ్రీలంకకు పీడకలనే మిగిల్చాడు. ఒక్క ఓవర్లోనే నాలుగు వికెట్లు తీసి తొలి అర్ధ గంటలోనే లంక పరాజయాన్ని ఖాయం చేసాడు. ఈ క్రమంలో పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్న సిరాజ్.. భారత్‌కి చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. దీంతో ఇప్పుడు సిరాజ్ ప్రదర్శనకు అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి.
తాజాగా విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ సిరాజ్‌ని ప్రశంసించింది. అనుష్క శర్మ తన ఇంస్టాగ్రామ్ వేదికగా “క్యా బాత్ హై మియాన్! మేజిక్!!” సిరాజ్ అంటూ పోస్ట్ చేసింది. సిరాజ్ ఇంత అగ్రెస్సివ్‌గా ఉండటానికి విరాట్ కోహ్లీ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ మ్యాచులో శ్రీలంక 50 పరుగులకే ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్యాన్ని టీమిండియా 37 బంతుల్లోనే చేధించింది. దీంతో రికార్డ్ స్థాయిలో భారత్ ఎనిమిదోసారి ఆసియా కప్ టైటిల్ నెగ్గింది. ప్రస్తుతం సిరాజ్ స్వదేశంలో జరుగుతున్న వన్డే సిరీస్ కి సన్నద్ధమవుతున్నాడు.