Mohammed Siraj: సింగిల్ హ్యాండ్ సిరాజ్.. మియా.. క్యా క్యాచ్ హై
రవీంద్ర జడేజా వేసిన 28వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. సిరాజ్ ఫీల్డింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసాధారణ క్యాచ్ అందుకున్నాడని ప్రశంసిస్తున్నారు.
Mohammed Siraj: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ సూపర్ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సిరాజ్ కళ్లు చెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. సింగిల్ హ్యాండ్‌తో సిరాజ్ అందుకున్న సూపర్ క్యాచ్‌తో జెర్మైన్ బ్లాక్‌వుడ్ పెవిలియన్ చేరాడు. రవీంద్ర జడేజా వేసిన 28వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. సిరాజ్ ఫీల్డింగ్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసాధారణ క్యాచ్ అందుకున్నాడని ప్రశంసిస్తున్నారు. తొలి రోజు ఆట ఫస్ట్ సెషన్ చివరి ఓవర్ లాస్ట్ బాల్‌కు బ్లాక్‌వుడ్ వెనుదిరిగాడు. జడేజా వేసిన ఆఫ్ స్టంప్ బాల్‌ను బ్లాక్ వుడ్ మిడాఫ్ దిశగా భారీ షాట్ ఆడాడు. కానీ ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్ గాల్లోకి ఎగిరి సింగిల్ హ్యాండ్‌తో బంతిని అందుకున్నాడు. ఈ క్యాచ్ పట్టుకునే క్రమంలో సిరాజ్ మోచేతికి గీసుకుపోయింది. నొప్పితో సిరాజ్ ఇబ్బంది పడినా.. క్యాచ్ పట్టాననే సంతోషంతో ఎగిరి గంతేసాడు.
ఈ వికెట్‌తో ఫస్ట్ సెషన్ ముగియగా.. వెస్టిండీస్ 68/4తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. ఈ మ్యాచ్‌తో ఇషాన్ కిషన్, యశస్వీ జైస్వాల్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. కోహ్లీ చేతుల మీదుగా ఇషాన్.. రోహిత్ చేతుల మీదుగా యశస్వీ అరంగేట్ర క్యాప్‌లు అందుకున్నారు. కేఎస్ భరత్‌పై వేటు వేసిన టీమ్ మేనేజ్‌మెంట్ మూడో పేసర్‌గా జయదేవ్ ఉనాద్కత్‌కు అవకాశం ఇచ్చింది.