మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్.. ఐపీఎల్ లో ఆ జట్టుదే టాప్ ప్లేస్

వరల్డ్ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఉన్న క్రేజే వేరు... విదేశీ స్టార్స్, స్వదేశీ స్టార్స్ తో ఐపీఎల్ కన్నుల పండుగగా సాగుతుంటుంది. ఇక లీగ్ లో ఆడుతున్న ప్రతీ టీమ్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 4, 2024 | 04:44 PMLast Updated on: Sep 04, 2024 | 4:44 PM

Most Fan Following That Team Is The Top Place In Ipl

వరల్డ్ క్రికెట్ లో సరికొత్త శకానికి తెరతీసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు ఉన్న క్రేజే వేరు… విదేశీ స్టార్స్, స్వదేశీ స్టార్స్ తో ఐపీఎల్ కన్నుల పండుగగా సాగుతుంటుంది. ఇక లీగ్ లో ఆడుతున్న ప్రతీ టీమ్ కు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సీజన్ సీజన్ కూ ప్రతీ ఫ్రాంచైజీ తమ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటున్నాయి. తాజాగా ఐపీఎల్ లో మోస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్ల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ అగ్రస్థానంలో నిలిచింది. సోషల్ మీడియాలో చెన్నైకి ఉన్న క్రేజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే.. ఇన్ స్టా గ్రామ్ లో 16 మిలియన్లు, ఫేస్ బుక్ లో 14 మిలియన్లు, ట్విట్టర్ లో 10.6 మిలియన్లు.. మొత్తం 40.6 మిలియన్ల ఫ్యాన్స్ చెన్నైకి ఉన్నారు.

ఇక ఐపీఎల్ లో అత్యధిక సార్లు టైటిల్స్ గెలిచి మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా గుర్తింపున్న ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో ఉంది. ఓవరాల్ గా ముంబై ఇండియన్స్ కు 36.3 మిలియన్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మూడో స్థానంలో నిలిచింది. ఒక్కసారి కూడా టైటిల్ గెలవకున్నా 32 మిలియన్ల మంది ఆర్సీబీని ఫాలో అవుతున్నారు. కాగా 17వ సీజన్ ఛాంపియన్ గా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ 28.8 మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్ తో నాలుగో స్థానంలో ఉండగా… సన్ రైజర్స్ హైదరాబాద్ 14.3 మిలియన్లతో ఐదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో రాజస్థాన్ రాయల్స్ , పంజాబ్ కింగ్స్ ఆరు , ఏడు స్థానాల్లో ఉండగా… ఢిల్లీ క్యాపిటల్స్ , గుజరాత్ టైటాన్స్ , లక్నో సూపర్ జెయింట్స్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.