MS Dhoni :సాలిడ్ బాడీ.. దిమ్మతిరిగే ధోని దేహదారుఢ్యం

ఐ పి ఎల్ స్టార్ట్ అవ్వనుండడంతో అన్ని ఫ్రాంచైజీలు నెట్ ప్రాక్టీస్ లో కసరత్తులు మొదలుపెట్టేశాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 16, 2023 | 05:13 PMLast Updated on: Mar 16, 2023 | 5:13 PM

Ms Dhoni Fitness

చెన్నై మాత్రం ఎప్పటిలాగే ఒకడుగు ముందుకు వేసి, ప్రాక్టీస్ తో పాటు తమ దూకుడును కూడా ఫ్యాన్స్ మధ్యలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇటీవల ధోనికి సంబంధించిన నెట్ ప్రాక్టీస్ వీడియోలను, ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో వదుల్తూ, మంచి హైప్ ను కూడగట్టుకుంటుంది. లేటెస్ట్ గా తమ జట్టు నాయకుడు ధోనికి సంబంధించిన మరో ఫుటేజ్ ను కూడా అభిమానుల ముందుకు తీసుకొచ్చింది సి ఎస్ కె జట్టు.

అందులో పురులు తిరిగిన కండలతో ధోని కొట్టే సిక్సర్లతో అభిమానులు తడిసిముద్దవుతున్నారు. ఐ పీ ఎల్ మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరగనుంది. చెన్నైను నాలుగుసార్లు ఛాంపియన్ గా నిలిపిన ధోనికి ఇదే చివరి ఐ పి ఎల్ అంటూ వస్తున్న గాసిప్స్ కు ధోని తన నెట్ ప్రాక్టీస్ వీడియోలతో ఎప్పటికప్పుడు చెక్ పెడుతూ వస్తున్నాడు. బ్యాటింగ్ కి సంబంధించి కఠోర సాధన చేస్తున్న ధోని, చెన్నై సూపర్ కింగ్స్ ను ఐదోసారి కూడా ఛాంపియన్ గా నిలిపేందుకు 24 ఇంటూ సెవెన్.. నెట్ లో బిజీగా గడుపుతున్నాడు.