World Cup 2023: అంతా ఫేక్.. ధోనీ ఎప్పుడూ అలా చెప్పలేదు.. అసలు మేటర్‌ ఇదే!

వరల్డ్‌కప్‌లో అఫ్ఘాన్‌పై రోహిత్ రికార్డు సెంచరీ చేయగానే కొంతమంది ధోనీకి క్రెడిట్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ధోనీ వల్లే రోహిత్‌ కెరీర్‌ మారిందని సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలైంది. దీనిపై స్పందించిన క్రికెటర్ శ్రీశాంత్ హాట్ కామెంట్స్ చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 13, 2023 | 01:51 PMLast Updated on: Oct 13, 2023 | 1:51 PM

Ms Dhoni Would Never Say He Made Rohit Sharmas Career Says Sreesanth

World Cup 2023: రోహిత్‌ శర్మ సూపర్‌ ఫాంలో ఉన్నాడు. అఫ్ఘాన్‌పై మ్యాచ్‌లో దుమ్మురేపాడు. రోహిత్‌ సెంచరీకి, ధోనీకి లింక్‌ చేసి కొందరు మాట్లాడుతుండడంపై క్రికెటర్ శ్రీశాంత్‌ స్పందించాడు. ఇదంతా ట్రాష్‌ అని కుండబద్దలు కొట్టాడు. చాలా మంది యంగ్‌ క్రికెటర్లకు లైఫ్‌ ఇచ్చిన ఘనత భారత్‌ మాజీ కెప్టెన్‌ ధోనీది. వరుసపెట్టి విఫలమవుతున్నా అనేక అవకాశాలు ఇచ్చి జట్టులో వారి ప్లేస్‌ని సుస్థిరం చేశాడు ధోనీ. రైనా, విజయ్ లాంటి క్రికెటర్లు ఎందరో ధోనీ అండతోనే పైకి వచ్చారు.

ఆర్పీ సింగ్‌, బద్రినాథ్‌ లాంటి వారికి కూడా ఎక్కువ అవకాశాలే ఇచ్చినా వారు జట్టులో స్థానాన్ని కాపాడుకోలేకపోయారు. అయితే అందరి కంటే ఎక్కువగా ధోనీకి రుణపడి ఉన్న క్రికెటర్‌ రోహిత్ శర్మ. హిట్‌మ్యాన్‌ని మ్యాగీమ్యాన్‌గా ఫ్యాన్స్‌ ట్రోల్ చేస్తున్న సమయంలో వరుసపెట్టి అవకాశాలు ఇచ్చాడు ధోనీ. రోహిత్‌ టాలెంట్‌ గురించి అందరికీ తెలిసినా నిలకడ లేమి సమస్యతో తీవ్ర విమర్శలు పాలయ్యేవాడు హిట్‌మ్యాన్‌. అయితే 2013లో ధోనీ తీసుకున్న ఒక్క నిర్ణయం రోహిత్‌ జీవితాన్నే మార్చేసింది. అంతకుముందు వరకు మిడిలార్డర్‌లో అడపాదడపా రాణిస్తున్న రోహిత్‌ని ఓపెనర్‌గా మార్చి, ఛాన్స్ ఇచ్చి చూశాడు ధోనీ. ఇక అప్పటినుంచి రోహిత్ శర్మ ఆటే మారిపోయింది. కోహ్లీతో పోటి పడి పరుగులు చేయడమే కాదు.. వన్డేల్లో ప్రపంచంలో మరెవరికీ సాధ్యంకాని రికార్డులను సృష్టించాడు రోహిత్. వన్డేల్లో మూడు డబులు సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌ రోహిత్. అటు టీ20ల్లోనూ సెంచరీల సునామీ క్రియేట్ చేశాడు. ఇటు వరల్డ్‌కప్‌లో అఫ్ఘాన్‌పై రోహిత్ రికార్డు సెంచరీ చేయగానే కొంతమంది ధోనీకి క్రెడిట్లు ఇవ్వడం మొదలుపెట్టారు.

ధోనీ వల్లే రోహిత్‌ కెరీర్‌ మారిందని సోషల్‌ మీడియాలో ప్రచారం మొదలైంది. దీనిపై స్పందించిన క్రికెటర్ శ్రీశాంత్ హాట్ కామెంట్స్ చేశాడు. తన వల్లే రోహిత్ కెరీర్ మారిందని ధోనీ ఎప్పుడూ చెప్పుకోలేదన్నాడు శ్రీశాంత్‌. ఓపెనర్‌గా రోహిత్ సెట్ అవుతాడని తెలిసే ధోనీ ఆ అవకాశం ఇచ్చాడని గుర్తు చేశాడు. ధోనీ వల్లే చాలా మంది కెరీర్‌లు మలుపు తిరిగాయని.. అయితే ధోనీ మాత్రం ఎప్పుడూ కూడా క్రెడిట్లు తీసుకోలేదన్నాడు శ్రీశాంత్‌. విరాట్ విషయంలోనైనా, రైనా, అశ్విన్‌ విషయంలోనైనా ఇదే జరిగిందన్నాడు. నిజానికి 2007లోనే టీమిండియా డెబ్యూ చేసిన రోహిత్ ఆరేళ్ల తర్వాత ఓపెనర్‌గా మారాడు. దీనికి అనేక కారణాలు ఉండగా.. ఆ తర్వాత మాత్రం రోహిత్ టీమిండియాకు పెద్ద దిక్కుగా మారాడు.