Rohith Sharma: కెప్టెన్ గా విరాట్ కోహ్లీ.. రోహిత్ అసలు జట్టులో ఉంటాడా?
టీమ్‌ఇండియా టెస్టు జట్టు సారథ్య బాధ్యతలపై మళ్లీ చర్చ ఊపందుకుంది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో వ్యక్తిగతంగానూ, జట్టును నడిపించడంలో కెప్టెన్ రోహిత్ శర్మ విఫలమయ్యాడనే విమర్శలు వచ్చాయి.

MSK Prasad suggested that Kohli should be given a chance to replace Rohit as the captain of the Indian cricket team
అతడిని తప్పించి మరొకరిని కెప్టెన్‌గా నియమించాలనే డిమాండ్లూ వస్తున్న నేపథ్యంలో.. భారత మాజీ క్రికెటర్, మాజీ చీఫ్ సెలక్టర్ ఎంఎస్కే ప్రసాద్ కీలక సూచనలు చేశాడు. రోహిత్ శర్మను తప్పిస్తే.. అతడి స్థానంలో మళ్లీ విరాట్ కోహ్లీకే అవకాశం ఇవ్వాలని సూచించాడు. అలా చెప్పడానికి అజింక్య రహానెను ఉదాహరణగా చూపిస్తూ ఎంఎస్కే వివరించాడు.
‘‘విరాట్ కోహ్లీకి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు? అజింక్య రహానె జట్టులోకి తిరిగి వచ్చి వైస్ కెప్టెన్ అయ్యాడు. కాబట్టి విరాట్ కెప్టెన్సీ ఎందుకు చేపట్టకూడదు? అయితే, సారథ్యంపై విరాట్ కోహ్లీ ఏమన్నాకుంటున్నాడో తెలియదు. రోహిత్‌ను కాదని వేరేవారిని నియమించాలని సెలక్టర్లు భావిస్తే మాత్రం విరాట్ వైపు మొగ్గుచూపాలి. ఇక రిషభ్ పంత్ కూడా మంచి ఆప్షనే. కానీ, అతడు ఎప్పుడు తిరిగి వస్తాడో తెలియదు. వచ్చి కుదురుకోవాల్సిన అవసరం ఉంది.
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ దేశాల్లో మరే ఇతర భారత వికెట్ కీపర్లు చేయని విధంగా పరుగులు సాధించాడు. అతడు మళ్లీ జట్టులోకి వచ్చాక పరిశీలించాలి’’ అని ప్రసాద్ తెలిపాడు. ప్రస్తుతం భారత్ విండీస్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడేందుకు సిద్ధమైంది. బుధవారం నుంచి తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరీస్‌లో రోహిత్ వ్యక్తిగతంగా రాణించకపోతే మాత్రం విమర్శలు మరింత తీవ్రమవుతాయి. టెస్టు కెప్టెన్సీ పోవడమే కాకుండా జట్టులో స్థానం కూడా గల్లంతయ్యే ప్రమాదం లేకపోలేదు.