Muhammad Rizwan: మ్యాచ్ కోసం వచ్చావా.. మత ప్రచారానికి వచ్చావా.. పాక్ ఆటగాడి అతి..!
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని పాకిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ క్రికెట్‌లోకి తీసుకొచ్చారు. మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన రిజ్వాన్.. పాకిస్తాన్ జట్టు విజయాన్ని పాలస్తీనా నగరమైన గాజా పౌరులకు అంకితం ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు.

Muhammad Rizwan: ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు అగ్ని జ్వాలగా మార్చేసిన విషయం తెలిసిందే. అక్రమంగా ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ ఉగ్రమూకలు వందల మందిని పొట్టనపెట్టుకోగా.. మరికొందరిని బందీలుగా చేసుకున్నారు. అందుకు ఇజ్రాయెల్ సైన్యం.. గట్టిగానే బుద్ధి చెప్తోంది. ఒకవైపు విద్యుత్తు, ఇంధనం, ఆహారా సరఫరాలు నిలిపేసిన ఇజ్రాయెల్.. మరోవైపు వైమానికి దాడులతో విరుచుకుపడుతోంది.
ఇదిలావుంటే, ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదాన్ని పాకిస్తాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ క్రికెట్‌లోకి తీసుకొచ్చారు. మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన రిజ్వాన్.. పాకిస్తాన్ జట్టు విజయాన్ని పాలస్తీనా నగరమైన గాజా పౌరులకు అంకితం ఇస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపాడు. ఈ పాకిస్థానీ క్రికెటర్, ఇలాంటి అనవసర విషయాలను హైలైట్ చేయడం ఇదేం కొత్త కాదు. న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా ప్రార్ధనకై మసీద్‌కి వెళ్లి, అక్కడి పౌరులను ప్రేరేపించిన ఉదంతాలు క్రికెట్ అభిమానులకు తెలుసు. హైదరాబాద్‌లో మ్యాచ్ సందర్భంగా, మ్యాచ్ మధ్యలో నమాజ్ చేస్తూ అటెన్షన్ పొందే ప్రయత్నం చేసాడు. ఇప్పుడు సున్నితమైన ఇజ్రాయెల్- పాలస్తీనా విషయాలను క్రికెట్‌లోకిలాగి, మరింత పాపులర్ అయ్యే పనిలో పడ్డాడు ఈ పాక్ ప్లేయర్.
మరో వైపు సుపరిచిత ఆఫ్ఘన్ ప్లేయర్ రషీద్ ఖాన్ మాత్రం ఆఫ్ఘన్ భూకంప బాధితులకు, తన వరల్డ్ కప్ రెమ్యూనరేషన్ మొత్తాన్ని ప్రకటించి రియల్ హీరో అనిపించుకున్నాడు. అందుకేనేమో రషీద్ ఖాన్ అంటే టీమిండియా క్రికెట్ అభిమానులు ఒకింత మనోడేరా అనే భావనతో రెస్పెక్ట్ ఇస్తుంటారు. ప్రార్థించే పెదవుల కన్నా, సాయం చేసే చేతులే మిన్న అనే కొటేషన్‌కి రషీద్ ఖాన్ పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలిస్తే, దారిన పోయే కంపను హెల్మెట్‌కు తగిలించుకునే పని పెట్టుకున్నాడు పాకిస్థాన్ క్రికెటర్ మొహమ్మద్ రిజ్వాన్.