Bumrah : ముంబై అతనికి రెస్ట్ ఇస్తే మంచిది..
టీమిండియా (Team India) మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ముంబై ఇండియన్స్ కు కీలక సూచన చేసాడు. ఎలాగూ ప్లేఆఫ్స్‌కు వెళ్లట్లేదు కాబట్టి ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సూచించాడు.

Mumbai better give him a rest..
టీమిండియా (Team India) మాజీ ఓపెనర్ వసీం జాఫర్ ముంబై ఇండియన్స్ కు కీలక సూచన చేసాడు. ఎలాగూ ప్లేఆఫ్స్‌కు వెళ్లట్లేదు కాబట్టి ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వాలని సూచించాడు. ఇంకో నెల రోజుల వ్యవధిలో టీ20 వరల్డ్ కప్ ఆడాల్సి ఉన్నందున.. బుమ్రా (Bumrah) రెస్ట్ ఇవ్వాలని ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌కు విజ్ఞప్తి చేశాడు.
ఈ కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకుంటే టీమిండియాకే మంచిదని అభిప్రాయపడ్డాడు. విశ్రాంతి తీసుకున్న అనంతరం బుమ్రా టీ20 వరల్డ్ కప్ (T20 World Cup) లో సత్తా చాటడానికి వీలు కలుగుతుందన్నాడు. ఏకధాటిగా క్రికెట్ ఆడటం వల్ల బుమ్రా అలసటకు గురి అవ్వొచ్చని, దాని ప్రభావం టీ20 వరల్డ్ కప్ పడితే ఇబ్బందులను కోరి తెచ్చుకున్నట్టవుతుందన్నాడు. టీ20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టులో బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌ను బూమ్రానే లీడ్ చేయాల్సి ఉంటుంది. అందుకే విశ్రాంతి ఇస్తే జట్టుకు మంచిదని వసీం జాఫర్ చెప్పాడు.