Mohammad Nabi: హార్దిక్‌పై మహ్మద్ నబీ గుర్రు

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అతడు తీసుకున్న ఓ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది సహజమే అయినా.. ఆ పోస్ట్‌ను ముంబై ప్లేయర్ మహ్మద్ నబీ అలాగే తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేయడం చర్చకు దారితీసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 19, 2024 | 07:45 PMLast Updated on: Apr 19, 2024 | 7:45 PM

Mumbai Indians Player Mohammad Nabi Turns Against Captain Hardik Pandya

Mohammad Nabi: ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై, అతడు తీసుకునే నిర్ణయాలపై ఇప్పటికీ ఆ జట్టులోని ప్లేయర్స్‌లో వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉంది. తాజాగా ఆ టీమ్ ఆల్ రౌండర్, ఆఫ్ఘన్ ప్లేయర్ మహ్మద్ నబీ పోస్ట్ చేసిన ఇన్‌స్టా స్టోరీ చర్చనీయాంశమైంది. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో తనకు బౌలింగ్ ఇవ్వకపోవడంపై నబీ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఈ పోస్టు ద్వారా స్పష్టమైంది.

AP ELECTIONS: ఇవీ వీళ్ల ఆస్తులు.. బాలయ్యకు ఇల్లు లేదు.. చంద్రబాబుకు కారు లేదు

పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో అతడు తీసుకున్న ఓ నిర్ణయాన్ని తప్పుబడుతూ ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది సహజమే అయినా.. ఆ పోస్ట్‌ను ముంబై ప్లేయర్ మహ్మద్ నబీ అలాగే తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేయడం చర్చకు దారితీసింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ముంబై ఇండియన్స్ మీ కెప్టెన్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వింతగా ఉన్నాయయనీ, ఆశ్చర్యానికి గురి చేస్తున్నారనీ పోస్ట్‌లో ఆ అభిమాని రాసుకొచ్చాడు.మహ్మద్ నబీ అసలు బౌలింగ్ చేయలేదనీ, ఎంతో కీలకమైన సమయంలో రెండు క్యాచ్‌లు పట్టాడు, ఒక రనౌట్ చేశాడు అంటూ పోస్ట్‌లో చెప్పాడు.

తనకు మద్దతుగా చేసిన ఈ పోస్టును నబీ అలాగే తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. తన కెప్టెన్ నిర్ణయాన్ని ఓ అభిమాని తప్పుబడితే.. దానిని సమర్థిస్తున్నట్లుగా నబీ ఇలా పబ్లిగ్గా పోస్ట్ చేయడం చూస్తుంటే ముంబై ఇండియన్స్ జట్టులో విభేదాలు తారస్థాయిలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే జట్టు రోహిత్, హార్దిక్ వర్గాలు విడిపోయినట్లు కూడా వార్తలు వస్తున్న వేళ ఈ పోస్ట్ మరిన్ని అనుమానాలకు తావిస్తోంది.