ఆ నలుగురే టార్గెట్, పెద్ద స్కెచ్చే వేసిన ముంబై

ఐపీఎల్ మెగా వేలం కోసం ముంబై ఇండియన్స్ రెడీ అవుతోంది. గత సీజన్ లో అట్టర్ ఫ్లాప్ అయిన ముంబై వేలంలో పక్కా ప్లానింగ్ తో వ్యవహరించాలని భావిస్తోంది. హార్థిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై గత సీజన్ లో పాయింట్ల పట్టికలో కింది నుంచి మొదటి నుంచి స్థానంలో నిలిచింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 11, 2024 | 07:26 PMLast Updated on: Nov 11, 2024 | 7:26 PM

Mumbai Target For Big Players

ఐపీఎల్ మెగా వేలం కోసం ముంబై ఇండియన్స్ రెడీ అవుతోంది. గత సీజన్ లో అట్టర్ ఫ్లాప్ అయిన ముంబై వేలంలో పక్కా ప్లానింగ్ తో వ్యవహరించాలని భావిస్తోంది. హార్థిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై గత సీజన్ లో పాయింట్ల పట్టికలో కింది నుంచి మొదటి నుంచి స్థానంలో నిలిచింది. రోహిత్ ను సారథిగా తప్పించడం విమర్శలకు దారితీయగా… పాండ్యా సరైన రీతిలో జట్టును నడిపించలేకపోయాడు. తిలక్ వర్మ తప్పిస్తే మిగిలిన వారంతా చేతులెత్తేశారు. దీంతో ఈ సారి ప్రతీ ప్లేస్ కూ ఇద్దరేసి ప్లేయర్స్ ను ఎంపిక చేసుకునేందుకు ముంబై సిద్ధమవుతోంది. ముంబై జస్‌ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ, తిలక్ వర్మ‌లను రిటైన్ చేసుకుంది. వీరి కోసం 75 కోట్లు ఖర్చుపెట్టగా..45 కోట్లతో వేలం బరిలోకి దిగుతోంది. ముఖ్యంగా వేలంలో నలుగురు కీలక ఆటగాళ్ళను సొంతం చేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. వాళ్ల కోసం కోట్లు కుమ్మరించడానికి కూడా సిద్ధమైంది.

ప్రధాన స్పిన్నర్, వికెట్ కీపర్, స్పిన్ ఆల్‌రౌండర్‌, ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తోంది. స్పిన్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్‌‌, స్పిన్నర్‌గా యుజువేంద్ర చాహల్, లెఫ్టార్మ్ పేసర్‌గా నటరాజన్, వికెట్ కీపర్‌గా ఫిలిప్ సాల్ట్‌ను దక్కించుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. చాహల్‌తో పాటు సుందర్ రాకతో స్పిన్ మరింత బలోపేతమవుతుంది. అదే సమయంలో సుందర్ ఆల్ రౌండర్ గానూ జట్టుకు ఉపయోగపడతాడు. ఇక పేస్ ఎటాక్ లో బుమ్రాతో పాటు నటరాజన్ డెత్ ఓవర్లలో కీలకమవుతాడని అంచనా వేస్తోంది. మరోవైపు ఫిలిప్ సాల్ట్ ను తీసుకుంటే కీపింగ్ లోనూ, అటు రోహిత్‌తో కలిసి ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేసేందుకు ఆప్షన్ గా ఉంటాడన్నది ముంబై ఆలోచన. పైగా సాల్ట్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. విండీస్ పై టీ ట్వంటీ సిరీస్ లో సెంచరీతో అదరగొట్టాడు. ఓవరాల్ గా ఈ సీజన్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇతర ఫ్రాంచైజీలు ఆర్‌టీఎమ్ ఉపయోగించలేని ప్లేయర్లపై ముంబై గురిపెడుతోంది.

ఎస్‌ఆర్‌హెచ్‌కు ఓ ఆర్‌టీఎమ్ ఉన్నప్పటికీ అది అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు మాత్రమే. నటరాజన్, సుందర్‌లపై ఉపయోగించలేదు. ఇక కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ ఆరుగురిని రిటైన్ చేసుకోవడంతో సాల్ట్, చాహల్‌ కోసం వాళ్ల ఆర్‌టీఎమ్‌తో పోటీకి రాలేరు. దీంతో బిడ్‌‌ను కంట్రోల్ చేయవచ్చని ముంబై భావిస్తోంది. మరోవైపు ముంబై దగ్గరనున్న మొత్తంతో ముంబై ఇండియన్స్ గరిష్టంగా 20 మందిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. దీనిలో అత్యధికంగా 8 మంది విదేశీ ప్లేయర్లను తీసుకోవచ్చు. ఇక తమ మాజీ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌ను ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా సొంతం చేసుకునే అవకాశం ఉంది. కాగా ఐపీఎల్ మెగా వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో జరగనుంది. విదేశాల్లో ఐపీఎల్ వేలాన్ని నిర్వహించడం వరుసగా ఇది రెండోసారి. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. దీనిలో 1165 మంది భారత క్రికెటర్లు , 409 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు.