Muthiah Muralidaran: నువ్ తమిళుడివా..? శ్రీలంక వాడివా..? నేను క్రికెటర్‌ను..!
తాజాగా 800 సినిమా ట్రైలర్‌ను క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్‌లో.. ముత్తయ్య మురళీధరన్ తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు, పరిస్థితులను, ఎత్తు పల్లాలను ఎంతో భావోద్వేగభరితంగా చూపించారు.

Muthiah Muralidaran: శ్రీలంక లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ 800. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముత్తయ్య మురళీధరన్ పాత్రలో స్లమ్‌డాగ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్ కనిపించనున్నాడు. తాజాగా 800 సినిమా ట్రైలర్‌ను క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇక ట్రైలర్‌లో.. ముత్తయ్య మురళీధరన్ తన జీవితంలో ఎదుర్కొన్న సంఘటనలు, పరిస్థితులను, ఎత్తు పల్లాలను ఎంతో భావోద్వేగభరితంగా చూపించారు.
శ్రీలంక టీమ్‌లో స్థానం కోసం ఆయన పడిన కష్టాలు, జట్టులోకి వచ్చాక నిలదొక్కుకోవడానికి ఆయన చేసిన ప్రయత్నాలు, తనని తాను ఒక గొప్ప బౌలర్‌గా ఆవిష్కరించుకున్న తీరును అద్భుతంగా చూపించారు. అంతేకాదు కెరీర్ మధ్యలో ఎదుర్కొన్న వివాదాలను, వాటిని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన ఎదుర్కొన్న పరీక్షలను, వాటి వెనుక ఆయన పడిన బాధను కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. మొత్తంగా 800 ట్రైలర్ చాలా ఎమోషనల్‌గా సాగింది. అంతేకాదు ఆడియన్స్‌లో కొంత ఆతృతను కూడా కలిగించింది. ఇక తమిళంలో రూపొందిన ఈ సినిమా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ రానుండగా.. సెప్టెంబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.