Naveen ul Haq: అప్పుడు విరాట్‌పై.. ఇప్పుడు ఆసీస్‌పై.. నవీన్ ఉల్ హక్ విమర్శలు..
ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగాల్సి ఉంది. కానీ, అఫ్గాన్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా నిరాకరించింది. కంగారుల నిర్ణయంతో అఫ్గాన్ జట్టు తీవ్ర నిరాశకు గురైంది. దీనిని దృష్టిలో పెట్టుకునే నవీన్ ఉల్ హక్ కామెంట్స్ చేశాడు.

Naveen ul Haq: భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో వరుస సంచలనాలతో అఫ్గనిస్థాన్ (Afghanistan) దూసుకుపోతోంది. సెమీస్ అవకాశాలు ఇప్పటికీ సజీవంగా ఉంచుకున్న అఫ్గన్ జట్టు రేపు ఆస్ట్రేలియా (Australia)తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇప్పటికే ప్రపంచకప్ మాజీ ఛాంపియన్లు ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంకలకు షాక్ ఇచ్చిన అఫ్గాన్.. ఇప్పుడు ఆస్ట్రేలియాకు షాక్ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో అఫ్గన్ ప్లేయర్ నవీన్ ఉల్ హక్ (Naveen ul Haq) చేసిన కామెంట్స్.. ఈ మ్యాచ్‌పై ఆసక్తిని మరింత పెంచాయి.
Sunil Narines : సునీల్ నరైన్ రిటైర్మెంట్ ఐపిఎల్ లో మాత్రం..
ఈ ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగాల్సి ఉంది. కానీ, అఫ్గాన్‌తో మ్యాచ్‌లు ఆడేందుకు ఆస్ట్రేలియా నిరాకరించింది. కంగారుల నిర్ణయంతో అఫ్గాన్ జట్టు తీవ్ర నిరాశకు గురైంది. దీనిని దృష్టిలో పెట్టుకునే నవీన్ ఉల్ హక్ కామెంట్స్ చేశాడు. ప్రపంచకప్‌లో కూడా అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌ను ఆస్ట్రేలియా బహిష్కరిస్తుందా అని నవీన్ ఉల్ హక్ వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ఈ ప్రశ్నను సంధిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. తమతో ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడటానికి ఆస్ట్రేలియా నిరాకరించిందని, ఇప్పుడు ప్రపంచకప్‌లో క్రికెట్ ఆస్ట్రేలియా వైఖరి ఏంటో చూడాలని ఆసక్తిగా ఉందని నవీన్ కామెంట్స్ చేశాడు. అప్గానిస్థాన్‌లో తాలిబన్ల పాలనలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనకు నిరసనగా క్రికెట్ ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సిరీస్‌ను రద్దు చేసుకుంది.
Virat Kohli : వెనక్కి తిరిగి చూడకు.. చెడుగుడు ఆడుకో..
దీనికి సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియాను నవీన్ టార్గెట్ చేశాడు. అఫ్గన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడకూడదన్న క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయం తర్వాత, నవీన్ ఉల్ హక్ కూడా ఆస్ట్రేలియా T20 టోర్నమెంట్ ‘బిగ్ బాష్ లీగ్’లో ఆడటానికి నిరాకరించాడు. అయితే, ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఈ ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక వంటి పెద్ద జట్లను అఫ్గన్ జట్టు ఓడించింది. కాబట్టి, ఆసీస్‌కు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది అని క్రికెట్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.