Sanju Samson: సంజూకి మళ్ళీ మొండిచేయి.. బీసీసీఐపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్..!
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు టీమిండియా జట్టును ప్రకటించింది. ఈ 15 మంది సభ్యుల జట్టులో సంజూ శాంసన్‌ను చేర్చలేదు. సంజూ శాంసన్ పేరు కనిపించకపోవడంతో అభిమానులు మరోసారి భారత సెలెక్టర్లపై ప్రశ్నలు లేవనెత్తారు.

young cricketer Sanju Samson did not get a place in the team selected for the Cricket World Cup
Sanju Samson: సంజూ శాంసన్‌ని ఎందుకు ఎంపిక చేయలేదు..? ఆ ఆటగాడు చేసిన తప్పేంటి..? సంజు శాంసన్‌కి ఎందుకు ఇంత అన్యాయం..? టీమ్ ఇండియాను ఎప్పుడు ప్రకటించినా ఇలాంటి ప్రశ్నలే అభిమానుల నుంచి వినిపిస్తుంటాయి. అయినా, బీసీసీఐ సెలెక్టర్లు మాత్రం మరోసారి ఈ కేరళ ఆటగాడిపై దయ చూపలేదు. దీంతో మరోసారి సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు బీసీసీఐపై విమర్శలు చేస్తున్నారు. సోమవారం.. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌కు టీమిండియా జట్టును ప్రకటించింది.
PITCH EFFECT: పిచ్ గండం.. పిచ్ కొంపముంచిందా..? బీసీసీఐ పెద్దలకు తెలివి లేదా..?
ఈ 15 మంది సభ్యుల జట్టులో సంజూ శాంసన్‌ను చేర్చలేదు. సంజూ శాంసన్ పేరు కనిపించకపోవడంతో అభిమానులు మరోసారి భారత సెలెక్టర్లపై ప్రశ్నలు లేవనెత్తారు. సంజూ శాంసన్‌ను టీ20 జట్టులో ఎంపిక చేయకపోవడానికి అతని ఫామ్ కారణం. ఈ ఆటగాడు గత రెండు టీ20 సిరీస్‌లలో టీమ్ ఇండియాలో భాగమయ్యాడు. వెస్టిండీస్‌లో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాల్గొన్న సంజూ ఐర్లాండ్‌లో ఆడిన రెండు టీ20 మ్యాచ్‌ల్లో కూడా అవకాశం పొందాడు. ఈ క్రమంలో సంజూ శాంసన్ ఘోరంగా విఫలమయ్యాడు. వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో సంజూ 32 పరుగులు మాత్రమే చేశాడు. ఇది మాత్రమే కాదు, అతను ఐర్లాండ్‌తో ఆడిన 2 మ్యాచ్‌ల్లో 41 పరుగులు చేశాడు. అతని టాప్ స్కోరు 27 పరుగులు. ఒకటి లేదా రెండు సిరీస్‌లనుబట్ట ఆటగాడిని వదులుకోవడం సరికాదని నెటిజన్లు అంటున్నారు. అయితే శాంసన్ అతని టీ20 కెరీర్‌లో మొత్తం 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. సంజూ శాంసన్‌ను దూరంగా ఉంచడానికి ఒక కారణం ఏమిటంటే.. టీమ్ ఇండియాకు ఆటగాళ్ల కొరత లేకపోవడం.
టీమ్ ఇండియాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ ఉన్నారు. తిలక్ వర్మ గురించి పరిశీలిస్తే.. మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ కూడా చేయగలడు. మ్యాచ్ ఫినిషర్‌గా రింకూ సింగ్ వేగంగా దూసుకుపోతున్నాడు. జితేష్ శర్మ తన దూకుడు బ్యాటింగ్, వికెట్ కీపింగ్ నైపుణ్యంతో సెలెక్టర్లను కూడా ఆకట్టుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో సెలక్టర్లు సంజూ శాంసన్‌ని పక్కన పెట్టారని తెలుస్తోంది.