గ్రౌండ్ లోకి దూసుకొచ్చిన అభిమాని ,పరాగ్ ప్లాన్ చేశాడంటున్న నెటిజన్లు
గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోలకత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేస్తున్న టైమ్ లో సెక్యూరిటీ కళ్లుగప్పి ఓ అభిమాని మైదానంలోకి దూసుకువచ్చాడు.

గువాహటి వేదికగా రాజస్థాన్ రాయల్స్, కోలకత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ చేస్తున్న టైమ్ లో సెక్యూరిటీ కళ్లుగప్పి ఓ అభిమాని మైదానంలోకి దూసుకువచ్చాడు. నేరుగా అతను గ్రౌండ్ లోకి వెళ్లి తన అభిమాన క్రికెటర్ రియాన్ పరాగ్ కాళ్లు మొక్కాడు.
ఊహించని ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని స్టేడియం బయటకు లాక్కెళ్లారు. దీనితి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. దీనిని పరాగ్ చేసిన పీఆర్ స్టంట్ అని అభివర్ణించారు. మీడియా అటెన్షన్ కోసమే పరాగ్ 10 వేలు ఇచ్చి ఇలాంటి పబ్లిసిటీ స్టంట్ కు ప్లాన్ చేసి ఉంటాడని కామెంట్ చేస్తున్నారు.