Sanju Samson: సూర్య వద్దు సంజూ ముద్దు
విండీస్‌తో మూడో వన్డేలో తనకు దక్కిన అవకాశాన్ని టీమిండియా యువ స్టార్ కేరళ సంజూ శాంసన్ సద్వినియోగం చేసుకున్నాడు.

Newcomer Sanju Samson performed better than Suryakumar Yadav
క్రీజులోకి వచ్చిన తర్వాత తొలి బంతి నుంచే దూకుడుగా ఆడిన అతను హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో మాజీలు, ఫ్యాన్స్ అందరూ అతని ఆటతీరును మెచ్చుకుంటున్నారు. ఈ జాబితాలో టీమిండియా మాజీ లెజెండ్ సాబా కరీం కూడా చేరాడు. శాంసన్‌కు ఆశించినన్ని అవకాశాలు దక్కకపోయినా.. వచ్చిన ఛాన్సులను అతను చక్కగా యూజ్ చేసుకుంటున్నాడని కొనియాడాడు. తనలోని సత్తాను అందరికీ చూపించే ప్రయత్నం చేశాడని మెచ్చుకున్నాడు. శాంసన్ ఎంతో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడని, తనో గిఫ్టెడ్ ప్లేయర్ అని కొనియాడాడు. ‘వన్డేల్లో సంజూకు ఇంత గుర్తింపు రావడం నిరంతరం పోరాడినందుకు దక్కిన ఫలితం అని చెప్పొచ్చు. శ్రేయాస్ లేని సమయంలో భారత్ వద్ద సంజూ, సూర్య రెండు ఆప్షన్లు ఉన్నాయి. వీరిద్దరి పాత్రలు రివర్స్ చేశారు. సూర్యకు బదులు సంజూను నాలుగో స్థానంలో పంపడంతో.. అతను ఈ పాత్రకు న్యాయం చేశాడు’ అని మెచ్చుకున్నాడు.