Virat Kohli: ఇండియన్ ఫ్యాన్స్‌కు నిరాశ.. కోహ్లీ-నవీన్ ఫైట్ మిస్..!
ఆర్సీబీ ఐపీఎల్-16లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలం కావడంతో ఈ ఇద్దరి మధ్య మరో ఫైట్ చూద్దామనుకున్న అభిమానులను నిరాశే ఎదురైంది. ఇప్పుడు ఆసియా కప్‌లో అయినా నవీన్.. అఫ్గాన్ టీమ్‌లో ఉంటే భారత్-అఫ్గాన్ మ్యాచ్‌లో ఈ ఇద్దరి రైవల్రీ వీక్షిద్దామనుకున్న కోహ్లీ, టీమిండియా ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది.
Virat Kohli: మూడు నెలల క్రితం భారత్ వేదికగా ముగిసిన ఐపీఎల్-16లో వివాదాస్పదమైన విరాట్ కోహ్లీ-నవీన్ ఉల్ హక్ ఫైట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. మేలో లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోహ్లీ.. బ్యాటింగ్ చేస్తున్న నవీన్ ఉల్ హక్‌ను కవ్వించడం, స్లెడ్జింగ్ చేయడంతో అతడు కూడా దానికి దీటుగానే బదులివ్వడం, ఇరువురి మధ్య సోషల్ మీడియా ఫైట్‌తో ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత స్థాయిలో వివాదం సాగింది.
అయితే ఆర్సీబీ ఐపీఎల్-16లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించడంలో విఫలం కావడంతో ఈ ఇద్దరి మధ్య మరో ఫైట్ చూద్దామనుకున్న అభిమానులను నిరాశే ఎదురైంది. ఇప్పుడు ఆసియా కప్‌లో అయినా నవీన్.. అఫ్గాన్ టీమ్‌లో ఉంటే భారత్-అఫ్గాన్ మ్యాచ్‌లో ఈ ఇద్దరి రైవల్రీ వీక్షిద్దామనుకున్న కోహ్లీ, టీమిండియా ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఆసియా కప్‌లో ఆడబోయే అఫ్గాన్ జట్టులో నవీన్ ఉల్ హక్‌కు చోటు దక్కలేదు. దీంతో అభిమానులు మరోసారి నిరాశకు గురయ్యారు. ఐపీఎల్-16లో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరకపోయినా.. జూన్ లేదా జులైలో అఫ్గాన్ జట్టు భారత పర్యటనకు వస్తుందని, అప్పుడు కోహ్లీ-నవీన్ ఫైట్‌ను చూద్దామనుకున్న ఫ్యాన్స్‌కు అప్పుడూ నిరాశే ఎదురైంది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడి వచ్చిన భారత్.. నేరుగా విండీస్ పర్యటనకే వెళ్లింది. అఫ్గాన్‌తో మూడు వన్డేల సిరీస్ వచ్చే ఏడాది జనవరికి వాయిదాపడింది. కానీ ఆసియా కప్‌లో అయినా కోహ్లీ-నవీన్ ఫైట్ చూద్దామనుకుంటే.. అఫ్గాన్ పేసర్ జట్టులో చోటు దక్కించుకోవడంలో విఫలం కావడంతో అభిమానులకు నిరాశ తప్పలేదు.
ఇందుకు సంబంధించి పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న మీమ్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఐపీఎల్ ఫైట్ తర్వాత కోహ్లీ ఫ్యాన్స్.. నవీన్‌ను మ్యాంగో మ్యాన్ అని పిలిచి దారుణమైన ట్రోలింగ్‌కు దిగారు. ముంబై ఇండియన్స్-ఆర్సీబీ మధ్య మ్యాచ్‌ను టీవీలో చూస్తున్నానని చెబుతూ మామిడి పండ్లు తింటున్న ఫోటోను తీసి ఇన్‌స్టాలో షేర్ చేయడం అతడి పాలిట శాపమైంది. అప్పట్నుంచి కోహ్లీ ఫ్యాన్స్ అతడిని మ్యాంగో మ్యాన్ అని పిలుస్తూ ఆటాడుకున్నారు.