Olympic Medal Swapnil : అప్పుడు టికెట్ కలెక్టర్…కట్ చేస్తే ఒలింపిక్ ఛాంపియన్
విశ్వక్రీడల్లో (World Sports) భారత్ కు పతకాల సంఖ్య పెంచుతోంది షూటర్లే... మిగిలిన క్రీడల్లో మనవాళ్ళు నిరాశపరుస్తున్నా షూటర్లు మాత్రం ప్రతీసారీ పరువు నిలుపుతున్నారు.

Now a ticket collector...Olympic champion if he makes the cut
విశ్వక్రీడల్లో (World Sports) భారత్ కు పతకాల సంఖ్య పెంచుతోంది షూటర్లే… మిగిలిన క్రీడల్లో మనవాళ్ళు నిరాశపరుస్తున్నా షూటర్లు మాత్రం ప్రతీసారీ పరువు నిలుపుతున్నారు. ఇప్పటి వరకూ భారత్ ఖాతాలో చేరిన మూడు మెడల్స్ షూటింగ్ లో వచ్చినవే..కట్ చేస్తే 50 మీటర్ల త్రీ పొజిషన్ ఈవెంట్ లో స్వప్నిల్ కుసాలె కాంస్యం గెలిచాడు. దీంతో అతని గురించి అభిమానులు గూగుల్ లో తెగ సెర్చ్ చేసేస్తున్నారు. 29 ఏళ్ల స్వప్నిల్ కుసాలె మహారాష్ట్ర కొల్హాపూర్‌కు సమీపంలో ఉన్న కంబల్‌వాడి గ్రామంలో పుట్టిపెరిగాడు. స్వప్నిల్ 2012 నుంచి అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటున్నప్పటికీ.. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అతనికి 12 ఏళ్లు పట్టింది. అరంగేట్రం ఒలింపిక్స్‌లోనే స్వప్నిల్ పతకం సాధించి తన కలను సాకారం చేసుకున్నాడు.. ఒలింపిక్స్‌లో 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ షూటర్ స్వప్నిల్ చరిత్ర సృష్టించాడు.
గత 12 ఏళ్లలో మొదట జూనియర్ స్థాయిలో, తర్వాత సీనియర్ కేటగిరీలో స్వప్నిల్ అనేక జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో (international tournament) సత్తా చాటాడు. అతని బ్యాక్ గ్రౌండ్ చూస్తే స్వప్నిల్ తండి టీచర్… తల్లి కంబల్‌వాడి గ్రామ సర్పంచ్. 2015 నుంచి సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్న స్వప్నిల్ టీమిండియా (Team India) మాజీ కెప్టెన్ (Former Captain) మహేంద్రసింగ్ ధోని (Mahendra Singh Dhoni) నే స్ఫూర్తిగా తీసుకున్నాడు. ధోనిని ఆరాధించే ఈ మహారాష్ట్ర షూటర్ కెరీర్ ఆరంభంలో రైల్వే టికెట్ కలెక్టర్‌గా పని చేశాడు. 2022లో జరిగిన ఆసియా క్రీడల్లో స్వప్నిల్ బంగారు పతకం (Swapnil Gold Medal) సాధించాడు. మిగిలిన క్రీడలతో పోలిస్తే షూటింగ్ చాలా ఖరీదైనది. రైఫిల్స్, జాకెట్లే కాదు ఒక్క బుల్లెట్ కొనడానికి కూడా భారీగా ఖర్ఛు చేయాల్సిందే. ఒకసారి ప్రాక్టీస్ కోసం బుల్లెట్‌లు కొనడానికి సరిపడా డబ్బు లేకపోవడంతో తన తండ్రి బ్యాంకులో అప్పు చేశారని స్వప్నిల్ గతంలోనే చెప్పాడు. ఇక కొన్ని అనారోగ్య సమస్యలతో కూడా పోరాడి ప్రాక్టీస్ కొనసాగించాడు. చివరికి తల్లిదండ్రుల ప్రోత్సాహం, కోచ్ శిక్షణతో ఇప్పుడు ఒలింపిక్ మెడల్ గెలవడం గర్వంగా ఉందంటున్నాడు స్వప్నిల్.