Virat Kohli : ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలూ… కోహ్లీ స్ట్రైక్ రేట్ పై ఫాన్స్ కౌంటర్

ఐపీఎల్ (IPL) 17వ సీజన్ లో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) దూకుడు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆర్సీబీ జట్టు ప్రదర్శన మొత్తం ఒకెత్తు అయితే.. విరాట్ కోహ్లీ ప్రదర్శన మరో ఎత్తనే చెప్పాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 10, 2024 | 06:00 PMLast Updated on: May 10, 2024 | 6:00 PM

Now Sebandra Boys Fans Counter On Kohlis Strike Rate

ఐపీఎల్ (IPL) 17వ సీజన్ లో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) దూకుడు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆర్సీబీ జట్టు ప్రదర్శన మొత్తం ఒకెత్తు అయితే.. విరాట్ కోహ్లీ ప్రదర్శన మరో ఎత్తనే చెప్పాలి. ఆర్సీబీ (RCB) కి ప్లే ఆఫ్స్ ఆశలు మిణుకు మిణుకు అంటున్నా.. ప్రత్యర్థులపై విరాట్ జోరు తగ్గలేదు. టీమిండియాలోనే కాదు ఐపీఎల్ (IPL2024) లో కూడా తాను కింగ్ అనే విషయాన్ని మరోసారి గుర్తు చేశాడు. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విజృంభించాడు. పంజాబ్ జట్టుకు ఎక్కడా కూడా ఆస్కారం లేకుండా విరాట్ కోహ్లీ రెచ్చిపోయాడు.

ఇప్పటికే ఈ సీజన్లో 5 అర్ధ శతకాలు నమోదు చేసిన కోహ్లీ.. ఈ మ్యాచ్ లో కూడా హాఫ్ సెంచరీ కొట్టాడు. తన స్ట్రైక్ రేట్ గురించి వచ్చిన విమర్శలకు ఈ మ్యాచ్ లో బ్యాట్ తోనే సమాధానం ఇచ్చాడు. కోహ్లీ కేవలం 47 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో ఏకంగా 92 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ శతకం చేస్తాడని భావించిన ఫ్యాన్స్ కి మాత్రం నిరాశ తప్పలేదు. కేవలం 8 పరుగుల తేడాతో కోహ్లీ అద్భుతమైన శతకాన్ని మిస్ చేసుకున్నాడు. ఇక్కడ కోహ్లీ సెంచరీ కోసం చూసుకోలేదు. అర్షదీప్ వేసిన 18వ ఓవర్లో సిక్స్ కొట్టడానికి ప్రయత్నించి ఔట్ అయ్యాడు. దీన్ని బట్టే అర్ధం అవుతుంది అతడు జట్టుకోసం ఆడే ప్లేయర్ అంటున్నారు ఫాన్స్… ఇప్పటికైనా స్లో బ్యాటింగ్, తక్కువ స్ట్రైక్ రేట్ అంటూ కూర్చుని విమర్శించే వాళ్లు నోర్లు మూస్తారా.. మూయకపోతే ఇక మీ కర్మ అంటూ ఫాన్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు.