అసభ్యకరమైన సైగలు, హెడ్ పై ఫ్యాన్స్ ఫైర్
గ్రౌండ్ లో హుందాగా ప్రవర్తించడం తమకు అలవాటు లేదని ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంటారు.. అంపైర్ కు అతిగా అప్పీల్ చేయడం, ప్రత్యర్థి ఆటగాళ్ళను స్లెడ్జింగ్ చేయడం వంటి చర్యలతో వార్తల్లో నిలుస్తుంటారు.
గ్రౌండ్ లో హుందాగా ప్రవర్తించడం తమకు అలవాటు లేదని ఆస్ట్రేలియా క్రికెటర్లు ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉంటారు.. అంపైర్ కు అతిగా అప్పీల్ చేయడం, ప్రత్యర్థి ఆటగాళ్ళను స్లెడ్జింగ్ చేయడం వంటి చర్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా బాక్సింగ్ డే టెస్ట్ చివరిరోజు వికెట్ తీసిన ఉత్సాహంలో ట్రావిస్ హెడ్ చేసిన పని తీవ్ర వివాదాస్పదమైంది. ఓపికగా ఆడుతున్న పంత్‌ను పార్ట్‌టైమ్ బౌలర్ అయిన ట్రావిస్ హెడ్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ సంతోషంలో గ్లాస్‌లో ఫింగర్ పెట్టి తిప్పుతున్నట్లు సంబరాలు చేసుకున్నాడు. అయితే ఈ సంబరాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది అసభ్యకరమైన సంజ్ఞ అని నెటిజన్లు, మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్లు మాత్రం అతని వేళ్లను మంచు మీద ఉంచాలనే ఒక జోక్‌ను గుర్తు చేసానని చెబుతున్నారు. ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ కూడా ఇదే విషయాన్ని విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చాడు
కానీ భారత ఫ్యాన్స్ , మాజీ ఆటగాళ్ళు మాత్రం హెడ్ తీరుపై మండిపడుతున్నారు. ఇదో అసభ్యకరమైన ప్రవర్తన అంటూ నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ ఎక్స్ వేదికగా ట్రావిస్ హెడ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.హెడ్ ప్రవర్తన చాలా అసభ్యకరంగా ఉందన్నాడు. ఇది జెంటిల్‌మన్ గేమ్‌కు ఏ మాత్రం మంచిది కాదనీ, పిల్లలు, మహిళలు మ్యాచ్ చూస్తుంటారు. ఇలా ప్రవర్తించడం సరికాదన్నాడు. ఇది ఏ ఒక్కరినో అవమానించినట్లు కాదనీ,. 150 కోట్ల భారత ప్రజలను ఇన్‌సల్ట్ చేయడమేనని ఫైర్ అయ్యాడు. భవిష్యత్తులో ఇలా మళ్లీ చేయకుండా అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలనీ ఐసీసీని కోరాడు. ఈ ట్వీట్ ను బీసీసీఐ, ఐసీసీలకు సిద్దూ ట్యాగ్ చేశాడు. ఐసీసీ ఛైర్మెన్‌గా జై షా ఉన్న నేపథ్యంలో ట్రావిస్ హెడ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఫ్యాన్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు.