IND VS ENG: రాంచీలో ఇద్దరు పేసర్లతో ఇంగ్లాండ్‌.. తుది జట్టు ఇదే

మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్‌ను జట్టు నుంచి తప్పించింది టీమ్ మేనేజ్‌మెంట్. వారిద్దరి స్థానంలో షోయబ్ బషీర్, ఒలీ రాబిన్సన్ జట్టులోకి వచ్చారు. రాబిన్సన్‌కు ఈ సిరీస్‌లో రాంచీ టెస్టు తొలి మ్యాచ్ కానుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 22, 2024 | 08:26 PMLast Updated on: Feb 22, 2024 | 8:26 PM

Ollie Robinson And Shoaib Bashir Recalled For Ranchi Test Wood And Rehan Miss Out

IND VS ENG: ఐదు టెస్టుల సిరీస్‌లో మరో సమరానికి భారత్, ఇంగ్లండ్ రెడీ అయ్యాయి. రాంచీ వేదికగా శుక్రవారం నుంచి నాలుగో టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ఇంగ్లండ్ తమ తుది జట్టును ప్రకటించింది. వరుసగా రెండు ఓటముల నేపథ్యంలో తుది జట్టులో కీలక మార్పులు చేసింది. బ్యాటుతో కూడా సత్తాచాటే ఇద్దరు బౌలర్లు జట్టులో స్థానం కోల్పోయారు. మార్క్ వుడ్, రెహాన్ అహ్మద్‌ను జట్టు నుంచి తప్పించింది టీమ్ మేనేజ్‌మెంట్.

INDIA TRAVEL: మార్చిలో చూడదగ్గ ప్రదేశాలివే.. మౌంట్ అబు వెళ్తారా..?

వారిద్దరి స్థానంలో షోయబ్ బషీర్, ఒలీ రాబిన్సన్ జట్టులోకి వచ్చారు. రాబిన్సన్‌కు ఈ సిరీస్‌లో రాంచీ టెస్టు తొలి మ్యాచ్ కానుంది. అండర్సన్‌తో కలిసి అతను పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు. తొలి రెండు టెస్టుల్లో ఒక్క పేసర్‌తోనే బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆ తర్వాత నుంచి తమ వ్యూహాన్ని మార్చుకుంది. ఉప్పల్ టెస్టులో మార్క్ వుడ్‌‌ను, వైజాగ్ టెస్టులో అండర్సన్‌ను జట్టులోకి తీసుకున్నారు. మూడో టెస్టులో వారిద్దరు తుది జట్టులోకి వచ్చారు. కాగా, రాంచీ పిచ్‌పై ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాంచీ పిచ్‌ గురించి ఎలాంటి అభిప్రాయానికి రాలేకపోతున్నామని వాపోయాడు. ఈ వికెట్‌పై ఎలా ఆడాలో తెలియట్లేదని, పిచ్‌పై పచ్చికతో పాటు పగుళ్లు కూడా ఉన్నాయన్నాడు.

ఇంతకుముందు ఇలాంటి పిచ్‌ను ఎప్పుడూ చూడలేదని వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే బజ్‌బాల్‌ కాన్సెప్ట్‌ వర్కౌట్ కాకపోయినా అదే పద్ధతిలో ఆడతామని ఇంగ్లాండ్ నిర్ణయించుకుంది. టెస్టుల్లో ప్రతీసారీ దూకుడు పనికిరాదని పలువురు మాజీలు సూచించినా ఇంగ్లాండ్ కోచ్ మెక్‌కల్లమ్ మాత్రం వాటిని కొట్టిపారేశాడు.