IPL Match 2023: ఓపెనర్లే కీలకం మరో సెంచరీ చేసే సత్తా వాళ్ళది
IPL 2023లో సూపర్ జెయింట్స్ బౌలింగ్ అటాక్ టాప్ ఫామ్‌లో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ ఈ సీజన్‌లో కాస్త నిలకడగా రాణించి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అయినప్పటికీ, వారు టాప్-4లో ఉన్నారు. మరియు ముందుకు సాఫీగా సాగడానికి ఈరోజు ఇక్కడ విజయం సాధించాలని చూస్తున్నారు.

Lucknow Players key role in team
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ ఫలితంతో KL రాహుల్ నిరాశ చెందాడు, ఎందుకంటే లక్నో జట్టు పోరాడి, చిఎవరి నిమిషంలో ఓడిపోయారు. రాహుల్ మరియు కైల్ మేయర్స్ నుండి మంచి ఆరంభం లభించినప్పటికీ, సూపర్ జెయింట్స్ సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు.
అయితే, అరంగేట్రం ఆటగాడు యుధ్వీర్ సింగ్ చరక్ 2 వికెట్లు తీయడంతో పాటు, చాలా పొదుపుగా బౌలింగ్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. సూపర్ జెయింట్స్ గ్రూప్ దశల్లో ఒక్కసారి మాత్రమే రాయల్స్‌తో ఆడాల్సి ఉంది, ఇదే అదునుగా సంజు జట్టును ఓడించాలనే తీవ్రమైన కసితో ఆసక్తిగా ఉంది.
రెండు జట్లు కాగితంపై చాలా బలంగా ఉన్నప్పటికీ, రాజస్థాన్ రాయల్స్ విజయానికి ఇక్కడ కూసింత ఎక్కువ శాతం ఉందని ప్రెడిక్షన్స్ చెప్తున్నాయి. వారి బ్యాట్స్‌మెన్‌లలో చాలా మంది మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్ అటాక్ కూడా బాగానే ఉంది. మరోవైపు, సూపర్ జెయింట్స్ కోసం మిడిల్ ఆర్డర్ ఇంకా క్లిక్ కాలేదు, వారు తమ కోసం పరుగులు స్కోర్ చేయడానికి టాప్ ఆర్డర్‌పై ప్రతి మ్యాచులోను ఆధారపడ్డారు. నేడు జరగబోయే మ్యాచులో లక్నోకు ఆయుష్ బధోని, అంత మిశ్రాలు ట్రంప్ కార్డుల్లా మారనున్నారు.