మా పిచ్ క్యూరేటర్ కుట్రలు ? జహీర్ ఖాన్ సెన్సేషన్ కామెంట్స్

ఐపీఎల్ 18వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జోరు కొనసాగుతోంది. తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 2, 2025 | 06:44 PMLast Updated on: Apr 02, 2025 | 6:44 PM

Our Pitch Curators Conspiracies Zaheer Khans Sensational Comments

ఐపీఎల్ 18వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ జోరు కొనసాగుతోంది. తన సూపర్ ఫామ్ కొనసాగిస్తూ టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జయింట్స్ పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ 16.2 ఓవర్లలో 177 పరుగులు చేసి గెలిచింది. అయితే ఈ మ్యాచ్ కోసం ఉపయోగించిన పిచ్ పై లక్నో కోచ్ జహీర్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పిచ్ క్యూరేటర్ ను ఉద్దేశిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పంజాబ్ క్యూరేటర్ ఈ పిచ్ ను తయారు చేశాడంటూ వ్యాఖ్యానించాడు. ఈ మ్యాచ్ లో తాము పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుందని, అందుకే తగిన విధంగా సిద్ధమయ్యామని, కానీ ఆశ్చర్యకరంగా పిచ్ పేసర్లకు సహకరించిందని వాపోయాడు. లక్నో తమకు హోం గ్రౌండ్ అని, అందుకు తగిన విధంగా పిచ్ ఉండాలని కోరుకోవడం తప్పేమీ కాదని ప్రశ్నించాడు.

అయితే క్యూరెటర్లు మాత్రం స్పిన్ కి బదులుగా పేసర్లకు సహకరించేలా పిచ్ రూపొందించారని.. ఇది సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానించాడు. ఈ విషయంపై క్యూరేటర్లతో మాట్లాడుతామని, భవిష్యత్తులో దీనిపై మరింత ఫోకస్ పెడతామని పేర్కొన్నాడు. కెప్టెన్ రిషబ్ పంత్ పిచ్ నెమ్మదిగా ఉంటుందని భావిస్తున్నానని చెప్పిన తర్వాత జహీర్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
హోమ్ గ్రౌండ్ లో తమ జట్టు గెలుస్తుందనే అంచనాలతో ప్రేక్షకులు మైదానానికి వచ్చారని.. కానీ లక్నో పిచ్ నీ పంజాబ్ క్యూరేటర్ సిద్ధం చేసినట్టు అనిపించిందనన్నాడు. ఈ కారణంగా అభిమానులు నిరాశకు గురయ్యారని చెప్పుకొచ్చాడు జహీర్ ఖాన్. ఇక ఇదే విషయంపై కెప్టెన్ రిషబ్ పంత్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. తాము పిచ్ స్పిన్ కి అనుకూలిస్తుందని భావించి దానికి తగ్గట్టే ఫైనల్ ఎలెవన్ ఎంచుకున్నామన్నాడు. పేసర్ ప్రిన్స్ కి బదులు సిద్ధార్ధ్ ని తీసుకున్నామని.. కానీ పేసర్లకు సహకరించేలా పిచ్ ఉండడంతో నష్టపోయామని పంత్ వ్యాఖ్యానించాడు. రాబోయే రోజుల్లో పిచ్ క్యూరేటర్ల నుండి మద్దతు లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

అయితే జహీర్ ఖాన్, రిషబ్ పంత్ వ్యాఖ్యలను పలువురు తప్పుపడుతున్నారు. ఆట సరిగ్గా ఆడకుండా పిచ్ ను , క్యూరేటర్ ను నిందించడం సరికాదంటున్నారు. ఆయా జ‌ట్ల‌లో లోపాలు సరిదిద్దుకోకుండా పిచ్ ల‌పై ఓట‌మి నెపం నెట్టివేయ‌డం క‌రెక్టు కాద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సీజ‌న్ లో ఇప్ప‌టికే కొన్ని జ‌ట్లు పిచ్ క్యూరేటర్లపై ఆరోప‌ణ‌లు చేశాయి. త‌మ‌కు త‌గిన విధంగా పిచ్ రూపోందించడం లేద‌ని ఫిర్యాదు చేస్తున్నాయి. తొలుత డిఫెండింగ్ చాంపియ‌న్ కోల్ క‌తా నైట్ రైడర్స్ ఈ అంశాన్నితెర‌పైకి తీసుకురాగా, త‌ర్వాత చెన్నై సూప‌ర్ కింగ్స్ కూడా ఇదే ప‌ల్ల‌వి అందుకుంది. త‌మ హోం గ్రౌండ్ లోని క్యూరెట‌ర్లు ఆయా జట్లకు అనుకూలంగా పిచ్ లు రూపొందించ‌డం లేద‌ని పేర్కొంటున్నాయి. అయితే ఏదేమైనా ఇలా సొంత గ్రౌండ్ లోని క్యూరెటర్ల‌పై ఆరోప‌ణ‌లు చేయ‌డం మాత్రం హాట్ టాపిక్ గా మారింది.