P.V. Sindhus : పి.వి. సింధు మోకాలికి గాయం.. కీలక టోర్నమెంట్ కు దూరం..

గత వారం రెన్నిస్ లో జరిగిన ఫ్రెంచ్ సూపర్ ఓపెన్ రెండో రౌండ్ లో సింధు గాయంతో తప్పుకున్నది. థాయిలాండ్ కు చెందిన సుపనిదా కటేతాంగ్ తో మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆమె మోకాలికి స్వల్పంగా గాయమైంది. వైద్యులు సింధుకు స్కాన్ చేసిన తర్వాత డాక్టర్ ఆమె మోకాలి లో స్వల్పంగా క్రాక్ వచ్చినట్లు గుర్తించారు. దీంతో డాక్టర్లు ఆమెకు రెస్టు తీసుకోవాలని సూచించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 1, 2023 | 11:34 AMLast Updated on: Nov 01, 2023 | 11:35 AM

P V Sindhus Knee Injury Away From Important Tournament

పి.వి. సింధు బహుశా ఈ పేరు తెలియని వారు అంటూ ఉండరు.. విద్యర్థులకు అయితే అసలు పరిచయం అక్కర్లేదు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి 2016 లో జరిగిన రియో ఒలింపిక్ క్రీడల్లో రజత పతకం సాధించి ఒలింపిక్ పోటీల్లో తొలి భారతీయ మహిళగా.. ఒక తెలుగు యువ మహిళగా రికార్డు సృష్టించింది తెలిసిందే. తాజాగా పి.వి సింధు గురించి ఓ బ్యాడ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఈ నెలలో జరగనున్న కీలక మైన టోర్నీకి సింధు దూరం కానుంది. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందా..?

గత వారం రెన్నిస్ లో జరిగిన ఫ్రెంచ్ సూపర్ ఓపెన్ రెండో రౌండ్ లో సింధు గాయంతో తప్పుకున్నది. థాయిలాండ్ కు చెందిన సుపనిదా కటేతాంగ్ తో మ్యాచ్ ఆడుతున్న సమయంలో ఆమె మోకాలికి స్వల్పంగా గాయమైంది. వైద్యులు సింధుకు స్కాన్ చేసిన తర్వాత డాక్టర్ ఆమె మోకాలి లో స్వల్పంగా క్రాక్ వచ్చినట్లు గుర్తించారు. దీంతో డాక్టర్లు ఆమెకు రెస్టు తీసుకోవాలని సూచించారు.

ప్రస్తుత సీజన్ లో  పి.వి. సింధు కొందిగా తడబడుతోంది. ఆమె తన ఫామ్ ను కోల్పోయినట్లు స్పష్టంగా కనిపింస్తోంది. ఆగ‌స్టులో సింధు ర్యాంక్ 17కు ప‌డిపోయిన విష‌యం తెలిసిందే. దాదాపు ఆరు నెలల తర్వాత మళ్లీ ఇటీవలే ఆమె టాప్ టెన్ లో చోటు సంపాదించింది. ఇక ఆర్కిటిక్ ఓపెన్‌, డెన్మార్క్ ఓపెన్ టోర్నీల్లో సెమీస్‌కు వెళ్ల‌డంతో ఆమె ర్యాంక్ కొంత మెరుగుప‌డుంది అని చెప్పవచ్చు.

నెక్స్ట్ జరగబోయే టోర్నమెంట్..

  • న‌వంబ‌ర్ 7 నుంచి 12 వ‌ర‌కు కొరియా మాస్ట‌ర్స్‌
  • న‌వంబ‌ర్ 14 నుంచి 19 వ‌ర‌కు జ‌పాన్ మాస్ట‌ర్స్
  • న‌వంబ‌ర్ 21 నుంచి 26 వ‌ర‌కు చైనా మాస్ట‌ర్స్‌
  • న‌వంబ‌ర్ 28 నుంచి డిసెంబ‌ర్ 3 వ‌ర‌కు

స‌య్యిద్ మోదీ ఇండియా ఇంట‌ర్నేష‌న‌ల్ టోర్నీలు జ‌ర‌గ‌నున్నాయి.

SURESH