T20, World Cup : పేసర్లదా… బ్యాటర్లదా.. పిచ్చెక్కిస్తున్న న్యూయార్క్ పిచ్
టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ (World Cup) లో ఇవాళ హై ఓల్టేజ్ ఫైట్ జరగబోతోంది. ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్, పాక్ క్రికెట్ పోరులో న్యూయార్క్ (New York) పిచ్‍పైనే అందరి కళ్లు ఉన్నాయి.

Pacers... to the batters... New York's pitch is maddening
టీ ట్వంటీ (T20) వరల్డ్ కప్ (World Cup) లో ఇవాళ హై ఓల్టేజ్ ఫైట్ జరగబోతోంది. ఫాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్, పాక్ క్రికెట్ పోరులో న్యూయార్క్ (New York) పిచ్‍పైనే అందరి కళ్లు ఉన్నాయి. ఆ పిచ్‍పై ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‍ల్లో బ్యాటర్లు నానా తంటాలు పడాల్సి వచ్చింది. దీంతో భారత్, పాకిస్థాన్ (India Pakistan) మ్యాచ్ సందర్భంగా పిచ్‍పై టెన్షన్ నెలకొంది. ఇదే పిచ్ లో దక్షిణాఫ్రికాపై శ్రీలంక 77 పరుగులకే ఆలౌటైంది. పిచ్ సమాంతరంగా లేకపోవటంతో బంతి బౌన్స్ రకరకాలుగా అయింది. బ్యాటర్లు చాలా ఇబ్బందులు పడ్డారు.
భారత్, ఐర్లాండ్ మధ్య మ్యాచ్ కూడా ఇదే స్టేడియంలో జరిగింది. బ్యాటర్లకు ఈ మ్యాచ్‍లోనూ పిచ్ చుక్కలు చూపింది. బ్యాటర్లు ఊహించలేని విధంగా కొన్ని బంతులు బౌన్స్ అయి ఆశ్చర్యపరిచాయి. ఈ క్రమంలో ఓ బంతి అనూహ్యంగా బౌన్స్ కాగా.. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు బ్యాటింగ్‍లో చేతికి గాయమైంది. దీంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. న్యూయార్క్ పిచ్ విషయంలో ఐసీసీపై విమర్శలు వచ్చాయి.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగాల్సిన పిచ్‍కు ఐసీసీ దిద్దుబాట్లు చేసిందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. పిచ్‍పై గతుకులు ఎక్కువగా లేకుండా రోలింగ్ ఎక్కువగా చేయించిందని తెలుస్తోంది. పచ్చిక కూడా ఎక్కువగా లేకుండా చేస్తోంది. పిచ్ సమాంతరంగా ఉండేలా చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో పిచ్ ఫ్లాట్‍గా ఉండి బ్యాటింగ్‍కు కూడా మెరుగవుతుందనే అంచనాలు ఉన్నాయి.