IPL vs PSL: పీఎస్‌ఎల్ కంటే ఐపీఎల్ బిగ్గెస్ట్ లీగ్.. సొంత బోర్డు గాలి తీసేసిన పాక్ మాజీ క్రికెటర్
ఐపీఎల్‌కు పోటీగా ఎన్నో లీగ్‌లు పుట్టుకొచ్చినప్పటికీ.. ఈ క్యాష్ రిచ్ లీగ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గించలేకపోయాయి. పాకిస్తాన్ సైతం ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)ను తీసుకొచ్చింది.
IPL vs PSL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ప్రపంచ క్రికెట్‌లో సరికొత్త శకానికి తెరతీసిన లీగ్.. రిచ్చెస్ట్ బోర్డు బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్‌ను వరల్డ్ క్రికెట్‌లో లీగ్స్‌కు కింగ్ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రపంచంలోని ప్రతీ ఒక్క క్రికెటర్ ఐపీఎల్‌లో ఆడాలని కలలు కంటుంటారు. ఐపీఎల్‌కు పోటీగా ఎన్నో లీగ్‌లు పుట్టుకొచ్చినప్పటికీ.. ఈ క్యాష్ రిచ్ లీగ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గించలేకపోయాయి. పాకిస్తాన్ సైతం ఐపీఎల్‌కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్)ను తీసుకొచ్చింది.
CONG FUNDS: కాంగ్రెస్ ఖజానా ఖాళీ…కాంగ్రెస్ దగ్గర డబ్బుల్లేవా ? క్రౌడ్ ఫండింగ్ తో నిధుల వేట
ఇప్పటికే 8 సీజన్లు గడిచిపోయినప్పటికీ పీఎస్‌ఎల్ మాత్రం పెద్దగా ఆదరణ పొందలేకపోయింది. అయితే పాక్ క్రికెటర్లు, మాజీలు పీఎస్‌ఎల్ వరల్డ్ క్రికెట్‌లో నెం వన్ అంటూ ప్రగల్బాలు పలుకుతుంటారు. ఐపీఎల్‌తో పోల్చుకుంటే తమదే గొప్ప లీగ్‌గా అభివర్ణిస్తుంటారు. ఏ విధంగా చూసినా పీఎస్‌ఎల్ ఏ స్థాయిలోనూ ఐపీఎల్‌కు పోటీ కానే కాదనేది అందరికీ తెలుసు. అయినప్పటకీ పాక్ మాజీలు ఓవరాక్షన్ చేస్తుంటారు. తాజాగా పాక్ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ మాత్రం వాస్తవాన్ని ఒప్పుకున్నాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్ కంటే ఐపీఎల్ చాలా పెద్ద క్రికెట్ లీగ్ అని అంగీకరించాడు. అక్రమ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐపీఎల్ లేదా పీఎస్‌ఎల్ పెద్దదా అన్న ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన అక్రమ్ తాను పీఎస్‌ఎల్‌తో పాటు ఐపీఎల్‌లోనూ కోచ్‌గా పనిచేశాననీ, అన్నిటికంటే ఐపీఎల్ అతి పెద్ద ప్రాంఛైజీ క్రికెట్ లీగ్ అనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. పీఎస్‌ఎల్‌ను ఐపీఎల్‌తో పోల్చడం సరికాదు.
పీఎస్‌ఎల్ పాకిస్తాన్‌కు మినీ ఐపీఎల్ మాత్రామేనని సొంత క్రికెట్ బోర్డు గాలితీసేశాడు. నిజానికి ఐపీఎల్‌కు వచ్చే ఆదాయంలో నాలుగోవంతు కూడా పీఎస్‌ఎల్‌కు లేదు. అంతేకాదు ఆటగాళ్ళ వేలం, స్పాన్సర్లు, ప్రైజ్‌మనీ, వ్యూయర్ షిప్ ఇలా ఏ అంశంలోనూ ఐపీఎల్ దరిదాపుల్లో కూడా పాక్ లీగ్ లేదు. ఐపీఎల్ విజేతకు ఇచ్చే ప్రైజ్‌మనీలో నాలుగోవంతు పాకిస్తాన్ సూపర్ లీగ్ విన్నర్‌కు ఇచ్చే ప్రైజ్‌మనీగా ఉంది. ఇవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నా కొందరు పాక్ మాజీలు ప్రగల్భాలు పలుకుతూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అక్రమ్ వాస్తవాన్ని ఒప్పుకుని హుందాగా వ్యవహరించాడంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.