Pakistan: చరిత్ర సృష్టించిన పాక్.. శ్రీలంక మీద కొత్త రికార్డ్
ఏంజెలో మాథ్యూస్, కెప్టెన్ కరుణరత్నేలు రాణించినా.. లెఫ్టార్మ్ స్పిన్నర్ నోమన్ అలీ 7 వికెట్లతో శ్రీలంకను చావుదెబ్బ తీశాడు. దీనికి తోడు నసీమ్ షాకు 3 వికెట్లు దక్కాయి. దీంతో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో పాక్ ఘన విజయం సాధించింది.
Pakistan: శ్రీలంక పర్యటనలో పాకిస్తాన్ రెండు టెస్టుల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. గురువారం ముగిసిన ఆఖరి టెస్టులో పాక్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఆతిథ్య లంకపై గెలిచింది. ఏంజెలో మాథ్యూస్, కెప్టెన్ కరుణరత్నేలు రాణించినా.. లెఫ్టార్మ్ స్పిన్నర్ నోమన్ అలీ 7 వికెట్లతో శ్రీలంకను చావుదెబ్బ తీశాడు. దీనికి తోడు నసీమ్ షాకు 3 వికెట్లు దక్కాయి. దీంతో ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇక సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన పాకిస్తాన్ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది. శ్రీలంక గడ్డపై పాకిస్తాన్‌కు ఇది ఐదో టెస్ట్ సిరీస్ విజయం. తద్వారా శ్రీలంక గడ్డపై అత్యధిక టెస్ట్ సిరీస్‌లు గెలిచిన తొలి జట్టుగా పాకిస్తాన్ రికార్డులకెక్కింది. అంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పేరిట ఉండేది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు శ్రీలంకలో నాలుగు టెస్టు సిరీస్‌లను సొంతం చేసుకున్నాయి. తాజా సిరీస్ విజయంతో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలను పాక్ అధిగమించింది. ఈ ఘనత సాధించిన జాబితాలో టీమిండియా మూడో స్ధానంలో ఉంది.