Asia Cup: గెలిచింది టీమిండియా.. సంబరాలు పాకిస్థాన్‌లో..!

భారత్ గెలుపును పాక్ సెలబ్రేట్ చేసుకోవడం లేదు. ఇండియా కన్నా మేమే గ్రేట్ అని పాక్ సెలబ్రేట్ చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తాజా ICC వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఆసియా కప్ గెలిచింది టీమిండియానే అయినా నెంబర్ వన్ కిరీటం మాత్రం పాక్ ఎగరేసుకుపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 18, 2023 | 04:47 PMLast Updated on: Sep 18, 2023 | 4:47 PM

Pakistan Remain Top Ranked Odi Side Despite Indias Asia Cup Victory

Asia Cup: ఆసియా కప్‌లో టీమిండియా విజయం సాధించిందో.. లేదో.. పాక్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. అదేంటి.. భారత్ గెలిస్తే పాక్ సంబరాలు చేసుకోవడమేంటి..? అనుకుంటున్నారా..? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇది నిజం. అయితే భారత్ గెలుపును పాక్ సెలబ్రేట్ చేసుకోవడం లేదు. ఇండియా కన్నా మేమే గ్రేట్ అని పాక్ సెలబ్రేట్ చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తాజా ICC వన్డే ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ఆసియా కప్ గెలిచింది టీమిండియానే అయినా నెంబర్ వన్ కిరీటం మాత్రం పాక్ ఎగరేసుకుపోయింది.

ఆసియా కప్ గెలవడం ద్వారా భారత్ రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ఆసియా కప్ ప్రారంభ సమయంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన పాక్.. ఆ తర్వాత ఆస్ట్రేలియా వరుస విజయాలకు నెంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. కానీ, ఆస్ట్రేలియా తమ చివరి మూడు వన్డేలు దక్షిణాఫ్రికా మీద ఓడిపోవడం, టీమిండియా సూపర్-4 లో బంగ్లాదేశ్‌పై పరాజయం పొందడం పాక్‌ని మళ్ళీ నెంబర్ వన్‌గా నిలబెట్టాయి. ఆసియా కప్ భారత్ గెలవడం తట్టుకోలేని పాక్ ఫ్యాన్స్.. తాము నెంబర్ వన్ జట్టు అని సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించారు. ఇదెక్కడి విడ్డూరమో తెలియదు గాని ఆసియా కప్ కనీసం ఫైనల్‌కి కూడా చేరుకోలేని తమ జట్టుని ఆకాశానికెత్తేస్తున్నారు పాక్ ఫ్యాన్స్. మరి పాక్ వింత చేష్టల్లో ఎప్పుడు మార్పు వస్తుందో చూడాలంటూ, టీమిండియా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు.