Babar Azam: టీవీలో మాటలు చెప్పడం సులువు.. కెప్టెన్సీపై అప్పుడే నిర్ణయం: బాబర్ ఆజామ్
టీవీలో మాటలు చెప్పడం సులువు. ఎవరైనా సలహాలు ఇవ్వాలనుకుంటే నాకు నేరుగా ఫోన్ చేయొచ్చు. నా నంబరు అందరికీ తెలుసు. మూడేళ్లుగా జట్టుకు నాయకత్వం వహిస్తున్నా. సారథ్యాన్ని ఎప్పుడూ భారంగా భావించలేదు.
Babar Azam: ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వైఫల్యంపై వెల్లువెత్తుతున్న విమర్శల్ని కెప్టెన్ బాబర్ ఆజామ్ తిప్పికొట్టాడు. టీవీలో మాటలు చెప్పడం సులువని వ్యాఖ్యానించాడు. అఫ్గానిస్తాన్ 8 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించిన నేపథ్యంలో మొయిన్ ఖాన్, షోయబ్ మాలిక్‌తో సహా మాజీ సారథులు పాక్ కెప్టెన్ బాబర్‌పై విమర్శలు గుప్పించారు.
Sanju Samson: జాతీయ జట్టుకు కానిస్టేబుల్ కొడుకు.. హ్యాపీ బర్త్ డే సంజు..
నాయకత్వ భారం అతని బ్యాటింగ్‌పై ప్రభావం చూపుతుందని ఆరోపించారు. ‘‘టీవీలో మాటలు చెప్పడం సులువు. ఎవరైనా సలహాలు ఇవ్వాలనుకుంటే నాకు నేరుగా ఫోన్ చేయొచ్చు. నా నంబరు అందరికీ తెలుసు. మూడేళ్లుగా జట్టుకు నాయకత్వం వహిస్తున్నా. సారథ్యాన్ని ఎప్పుడూ భారంగా భావించలేదు. ప్రపంచకప్‌లో ఆశించిన స్థాయిలో రాణించనందుకే ఒత్తిడిలో ఉన్నానని అంటున్నారు. నేను ఒత్తిడిలో లేను. ఫీల్డింగ్‌లో నూటికి నూరు శాతం ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు పరుగులు రాబట్టి జట్టుకు విజయాన్ని అందించాలని ఆలోచిస్తా.
పాకిస్థాన్‌కు వెళ్లిన తర్వాత కెప్టెన్సీ విషయంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు దాని గురించి ఆలోచించట్లేదు. తర్వాతి మ్యాచ్‌పైనే నా దృష్టంతా’’ అని బాబర్ వివరించాడు. తాజా వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. పాక్ సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి.