అందుకే మీ తోక వంకర చైనాకు మద్ధతిచ్చిన పాక్

కుక్క తోక వంకర అన్నది పాకిస్తాన్ కు ఏ విషయంలోనైనా సరిపోతుంది. భారత్ పై పాక్ కు ఏ స్థాయిలో అక్కసు ఉందనేది ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ ద్వారా మరోసారి రుజువైంది. ఫైనల్లో భారత్ 1-0 గోల్స్ తేడాతో చైనాను చిత్తు చేసి ఛాంపియన్ గా నిలిచింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 18, 2024 | 08:25 PMLast Updated on: Sep 18, 2024 | 8:25 PM

Pakistan Support China

కుక్క తోక వంకర అన్నది పాకిస్తాన్ కు ఏ విషయంలోనైనా సరిపోతుంది. భారత్ పై పాక్ కు ఏ స్థాయిలో అక్కసు ఉందనేది ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీ ద్వారా మరోసారి రుజువైంది. ఫైనల్లో భారత్ 1-0 గోల్స్ తేడాతో చైనాను చిత్తు చేసి ఛాంపియన్ గా నిలిచింది. అయితే ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా పాక్‌ ఆటగాళ్లు చైనాకు మద్దతుగా నిలిచి అబాసుపాలయ్యారు. పాక్‌ సెమీఫైనల్లో చైనా చేతిలో ఘోరంగా ఓడినప్పటకీ.. సిగ్గు లేకుండా చైనా జెండాలు పట్టుకున్నారు. అంతేకాదు ఏకంగా తమ బుగ్గలపై చైనా జెండా స్టిక్కర్లు అంటించుకుని మద్దతు తెలిపారు. తాము మద్దతు తెలిపినా చైనా ఓడిపోవడంతో పాక్‌ ఆటగాళ్లు దిగాలుగా కూర్చున్న ఫోటోలు సోషల్‌మీడియాలో వైరలయ్యాయి. దీంతో భారత్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో పాక్ ప్లేయర్స్ ను ఆడేసుకుంటున్నారు.