Shadab Khan: ఒకప్పుడు అందరిది ఒకే జాతి పాక్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం పాక్ క్రికెటర్ షాదాబ్ ఖాన్ మేజర్ క్రికెట్ లీగ్ ఆడుతున్నాడు. శాన్ ఫ్రాన్సికో యూనికార్న్స్ టీమ్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్న షాదాబ్.. టీమిండియా క్రికెటర్లు తజిందర్ సింగ్, చైతన్య భిష్ణోయ్‌లతో కలిసి ఆడుతున్నాడు. వీరిద్దరూ కూడా బీసీసీఐకి రిటైర్మెంట్ ఇచ్చి మేజర్ లీగ్ క్రికెట్ లో పాల్గొంటున్నాడు.

Pakistani cricketer Shadab Khan is playing Major Cricket League
ఈ లీగ్ అమెరికాలో జరుగుతున్నా.. ఇందులో టీమ్స్ అన్నీ కూడా ఐపీఎల్ ఫ్రాంఛైజీలవే. ముంబై ఇండియన్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి టీమ్స్… మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో ఫ్రాంఛైజీలను దక్కించుకున్నాయి.. దీంతో పాక్ క్రికెటర్ షాదబ్ ఖాన్, ఈ సందర్భంగా చాలా జాగ్రత్తగా మాట్లాడాడు.ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ జట్లు బద్ధ శతృవుల్లాగా ఉంటున్నాయిగాని ఒకప్పుడు పాకిస్థాన్ తో పాటు బంగ్లాదేశ్ కూడా మన దేశంలో భాగమే. చరిత్రను ఒకసారి చూసుకుంటే స్వాతంత్య్రం రాక ముందు వరకు కలిసి ఉన్న భారత్, పాకిస్థాన్.. స్వాతంత్య్రం అనంతరం కూడా స్నేహపూర్వకంగానే ఉన్నాయి.
ఆ తర్వాత క్రమంగా ఈ రెండు దేశాల మధ్య సఖ్యత లోపించడంతో పాటు శత్రుత్వ దేశాలుగా మారాయి. రెండు దేశాల మధ్య ఎంత శత్రుత్వం ఉన్నప్పటికీ కలిసి క్రికెట్ మ్యాచులు ఆడుతూ కొన్ని సంవత్సరాలు వినోదాన్ని పంచాయి. అయితే భద్రత కారణాల దృష్ట్యా గత కొన్నేళ్లుగా ఈ రెండు జట్లు ద్వైపాక్షిక సిరీస్ ఆడడం మానేశాయి. ఇక అప్పటి నుంచి భారత్ పై పాక్ క్రికెటర్లు నెగిటీవ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. అయితే పాక్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ మాత్రం మాటలు మాత్రం ఆసక్తికరంగా మారాయి. “1947 కి మనమంతా ఒక్కటే కదా. భారత సోదరులతో కలిసి ట్రైనింగ్ తీసుకోవడం చాల ఆనందంగా ఉంది.
భారత్, పాకిస్థాన్ ల మధ్య ఏమయినా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడానికి ఇదే చక్కని అవకాశం. ఒకప్పుడు ఇండియా లేకపోతే పాకిస్థాన్ లేదు. మన భాషలు, సంస్కృతులు అంతా ఒక్కటే. పంజాబీలో మాట్లాడుతుంటే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. హిందీలో టీమిండియా ప్లేయర్లతో మాట్లాడుతుంటే అన్నాదమ్ములతో మాట్లాడిన అనుభూతి కలుగుతుంది”. అంటూ ఈ సందర్భంగా పాక్ క్రికెటర్ షాదాబ్ కామెంట్ చేశాడు.