Pakistan, Girls : పాకిస్థాన్ అమ్మాయిల గోల.. గూగుల్ లో అతడి కోసం..

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన వ్యక్తిగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్‌కు ఉన్న క్రేజ్, పాపులారిటీకి ఇది సహజమే. టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్‌ గిల్ కూడా ఈ ఏడాది అత్యధికంగా శోధించిన జాబితాలో 8వ స్థానంలో ఉన్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 14, 2023 | 01:25 PMLast Updated on: Dec 14, 2023 | 1:25 PM

Pakistani Girl Gola Google For Him

ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్‌ చేసిన వ్యక్తిగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. విరాట్‌కు ఉన్న క్రేజ్, పాపులారిటీకి ఇది సహజమే. టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్‌ గిల్ కూడా ఈ ఏడాది అత్యధికంగా శోధించిన జాబితాలో 8వ స్థానంలో ఉన్నాడు. అయితే పాకిస్థాన్‌లో అమ్మాయిలు, గిల్ కోసం ఎక్కువగా వెతికారట. పాకిస్థాన్‌లో గూగుల్‌ టాప్‌ ట్రెండింగ్‌ సెర్చ్‌ 2023లో పాక్ మాజీ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ టాప్ 10లో కూడా లేకపోవడం విశేషం. జియో న్యూస్‌లో వచ్చిన నివేదిక ప్రకారం.. పాకిస్థాన్‌ యువతులు ఈ ఏడాది గూగుల్‌లో అత్యధికంగా శోధించిన జాబితాలో శుభ్‌మన్‌ గిల్ టాప్ 10లో ఉన్నాడు. ఆశ్చర్యకరంగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ఈ జాబితాలో లేడు. గత ఏడాది కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్లలో గిల్ అద్భుత ప్రదర్శన చేశాడు.