Mumbai Indians : ముంబై జట్టులో లుకలుకలు… బయటపడ్డ పాండ్యా, బుమ్రా విభేదాలు
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టులో అంతా సవ్యంగా లేనట్టు కనిపిస్తోంది. కెప్టెన్ గా గత సీజన్ వరకు గుజరాత్ టైటాన్స్‌కు (Gujarat Titans) సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా... ఈ సీజన్ మినీ వేలానికి ముందు క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.

Pandya and Bumrah differences revealed in the Mumbai team
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టులో అంతా సవ్యంగా లేనట్టు కనిపిస్తోంది. కెప్టెన్ గా గత సీజన్ వరకు గుజరాత్ టైటాన్స్‌కు (Gujarat Titans) సారథ్యం వహించిన హార్దిక్ పాండ్యా… ఈ సీజన్ మినీ వేలానికి ముందు క్యాష్ ట్రేడింగ్ డీల్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. వచ్చి రాగానే అతనికి ముంబై మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయంపై రోహిత్ శర్మతో పాటు జస్‌ప్రీత్ బుమ్రా (Jaspreet Bumma) అసంతృప్తిగా ఉన్నారు. అభిమానులు కూడా ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
తాజాగా హార్దిక్ పాండ్యా, స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మధ్య ఉన్న విభేదాలు బయట పడ్డాయి. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ఫీల్డ్ సెటప్ విషయంలో హార్దిక్ పాండ్యా సూచనలను జస్‌ప్రీత్ బుమ్రా పట్టించుకోలేదు.ఫీల్డింగ్ మారుస్తానని చెప్పినా వినిపించుకోలేదు. దాంతో ఇద్దరి మధ్య కాస్త వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతో రోహిత్ శర్మ జోక్యం చేసుకున్నాడు. రోహిత్ ఎంట్రీతో అక్కడి నుంచి హార్దిక్ పాండ్యా దూరంగా వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.