Hardik Pandya : దాదా రికార్డును బ్రేక్ చేసిన పాండ్యా
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Captain Hardik Pandya) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ (IPL) చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఆటగాళ్ల జాబితాలో భారత దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీని అధిగమించాడు.

Pandya broke Dada's record
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Captain Hardik Pandya) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ (IPL) చరిత్రలోనే అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన ఆటగాళ్ల జాబితాలో భారత దిగ్గజ క్రికెటర్ సౌరవ్ గంగూలీని అధిగమించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) తో జరిగిన మ్యాచ్ ద్వారా హార్దిక్ పాండ్యా ఈ ఫీట్ సాధించాడు.ఐపీఎల్‌లో కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యాకు ఇది 43వ మ్యాచ్. గతంలో సౌరవ్ గంగూలీ 2008 నుంచి 2012 వరకు కోల్‌కతా నైట్‌రైడర్స్, పుణేవారియర్స్ జట్లకు సారథ్యం వహించాడు. సారథిగా దాదా 42 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలం ముంగిట హార్దిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ వదిలేయగా.. అతను కొత్త టీమ్ అయిన గుజరాత్ టైటాన్స్‌కు సారథ్యం వహించి ఛాంపియన్ గా నిలిపాడు.ఈ సారి ట్రేడింగ్ ద్వారా మళ్ళీ ముంబై పాండ్య ను టీమ్ లోకి తీసుకుని సారథ్య బాధ్యతలు అప్పగించింది.
అయితే పాండ్య అనుకున్న స్థాయిలో ముంబై ను నడిపించలేక పోతున్నాడు.