పాండ్యా నయా హిస్టరీ, మ్యాచ్ ఓటమితో ఎమోషనల్
ఐపీఎల్ 18వ సీజన్ లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో చివరి వరకూ పోరాడి ఓడిపోయింది.

ఐపీఎల్ 18వ సీజన్ లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో చివరి వరకూ పోరాడి ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో పాండ్యా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. మొదట బంతితో ఐదు వికెట్లు తీయగా… తర్వాత బ్యాట్ తో చివరి వరకూ క్రీజులో నిలిచి పోరాడాడు. కానీ జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. అయితే ఈ మ్యాచ్ లో ఐదు వికెట్లు తీయడం ద్వారా పాండ్యా చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్ లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్ ను నమోదు చేయడం ద్వారా పలు రికార్డులను ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ లో ఏ కెప్టెన్ సాధించని ఘనత సాధించాడు హార్దిక్ పాండ్య. ఐపీఎల్ చరిత్రలో 5 వికెట్ల ప్రదర్శన చేసిన తొలి కెప్టెన్ గా నిలిచాడు. ఈ మ్యాచులో హార్దిక్ పాండ్య.. మరక్రమ్, నికోలస్ పూరన్ , రిషభ్ పంత్ , డేవిడ్ మిల్లర్ , ఆకాశ్ దీప్ వికెట్లను తీయడం ద్వారా లక్నో జోరుకు బ్రేక్ వేశాడు. లేదంటే ఆ జట్టు.. 203 కన్నా మరింత ఎక్కువ స్కోరే సాధించేది.
లక్నో తో మ్యాచ్‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన బెస్ట్ అంతా ఇచ్చాడు. ఆఖరి వరకూ పాండ్యా క్రీజులో ఉన్నప్పటికీ ముంబై ఓడిపోయింది. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి హార్దిక్ 36 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకున్నాడు. బ్యాటింగ్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 16 బంతుల్లో 28 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.ముంబై ఓటమికి ఎన్నో కారణాలున్నప్పటికీ బాధ్యతంతా తనదే అని పాండ్యా స్టేటమ్‌మెంట్ ఇచ్చాడు. చేతుల్లోకి వచ్చిన మ్యాచ్ చేజేతులారా ఓడిపోవడంతో హార్దిక్ పాండ్యా ఎమోషనల్ అయ్యాడు.
ఒకానొక దశలో మ్యాచ్ ముంబైదే అనుకున్నప్పటికీ లక్నో బౌలర్లు దీటుగా బౌలింగ్ చేయడంతో ఓటమి తప్పలేదు. ఆఖరి వరకూ తాను క్రీజులో ఉన్నప్పటికీ ముంబై ఓడిపోవడంతో హార్దిక్ చాలా ఎమోషనల్ అయ్యాడు. మ్యాచ్ అనంతరం దిగాలుగా గ్రౌండ్‌లో ఉన్న బ్లాక్ బోర్డుకు తల ఆనించిఒకటికి రెండుసార్లు బాదుకున్నాడు.
మ్యాచ్ అనంతరం హార్దిక్ మాట్లాడుతూ మ్యాచ్ ఓటమికి పూర్తి బాధ్యత తనదే అన్నాడు. తాను ఎవర్నీ నిందించాలని అనుకోవడం లేదన్నాడు. మేము జట్టుగానే గెలుస్తామనీ,, జట్టుగానే ఓడిపోతామన్నాడు. ఏ ఒక్కర్నీ దీనికి బాధ్యులను చేయాలని అనుకోవడం లేదన్న పాండ్యా .తానే ఓటమికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచులో మొదటగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఛేజింగ్ లో టాపార్డర్ విఫలమైనా సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్ రాణించడంతో మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠగానే సాగింది. కానీ చివర్లో లక్నో బౌలర్లు పుంజుకోవడంతో హార్థిక్ , తిలక్ వర్మ భారీ షాట్లు ఆడలేకపోయారు.దీంతో ముంబై 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.