PANDYA SANI : పాండ్యా నెత్తిన తాండవిస్తోన్న శని
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఇంకా ఖాతా తెరవలేదు. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. హర్థిక్ సేనకి వరుసగా మూడో ఓటమి ఎదురైంది.
ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఇంకా ఖాతా తెరవలేదు. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) హ్యాట్రిక్ విక్టరీ కొట్టింది. హర్థిక్ సేనకి వరుసగా మూడో ఓటమి ఎదురైంది. ఈ క్రమంలో ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యాను నెటిజన్లు మరోసారి ట్రోల్ చేస్తున్నారు. ఇదేం చెత్త కెప్టెన్సీ ? చేత కాకుంటే రోహిత్ శర్మకు (Rohit Sharma) ఇచ్చేయ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ పరంగా ముంబై ఘోరంగా విఫలమైంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్… రాజస్తాన్ బౌలర్ల ధాటికి వణికిపోయింది. పేసర్ ట్రెంట్ బౌల్ట్, స్పిన్నర్ చాహల్ తలో మూడు వికెట్లతో ముంబై దెబ్బతీశారు. బర్గర్ రెండు, అవేష్ ఖాన్ ఒక్క వికెట్ పడగొట్టారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 9 వికెట్లు కోల్పోయి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో హార్దిక్ పాండ్యా 34, తిలక్ వర్మ 32 పరుగులు చేశారు. డకౌట్ తో రోహిత్ శర్మ చెత్త రికార్డ్ ని ఖాతాలో వేసుకున్నాడు.
126 పరుగుల ఈజీ టార్గెట్ తో బరిలోకి దిగిన రాజస్తాన్ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లలో రియాన్ పరాగ్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్‌లో ముంబై సారథిగా బాధ్యతలు చేపట్టిన హార్దిక్ పాండ్యా తన మార్క్ చూపలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబై అట్టర్ ఫ్లాప్ అయింది. కెప్టెన్‌గా తన వ్యూహాలను అమలు చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు. అతడిని ముంబై కెప్టెన్సీ నుంచి తప్పించి మళ్లీ రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పజెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ముంబై ఓడిపోవడం ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాను తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక చాలు హార్దిక్… వెంటనే రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇచ్చే అంటూ కామెంట్లు చేస్తున్నారు.