యువ వికెట్ కీపర్ గొప్పమనసు ఓ విద్యార్థి కాలేజీ ఫీజు కట్టిన పంత్

భారత యువక్రికెటర్ రిషబ్ పంత్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఓ కాలేజీ విద్యార్థికి ఫీజు కట్టి చేయూతనిచ్చాడు. ఇంజినీరింగ్ చదువుకుంటున్న ఓ యువకుడు తన కాలేజ్ ఫీజ్ కోసం డబ్బులు కావాలని పంత్​ను అడిగాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 27, 2024 | 03:19 PMLast Updated on: Aug 27, 2024 | 3:19 PM

Pant The Young Wicket Keeper Is A Brilliant Minded Student Who Has Paid His College Fees

భారత యువక్రికెటర్ రిషబ్ పంత్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఓ కాలేజీ విద్యార్థికి ఫీజు కట్టి చేయూతనిచ్చాడు. ఇంజినీరింగ్ చదువుకుంటున్న ఓ యువకుడు తన కాలేజ్ ఫీజ్ కోసం డబ్బులు కావాలని పంత్​ను అడిగాడు. దీనిపై వెంటనే స్పందించిన పంత్ అతడికి కావాల్సిన మొత్తాన్ని అందజేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆపదలో ఉన్నవారికి ఇలా సాయం చేయడం కంటే గొప్ప ఆస్తి ఏదీ లేదని నెటిజన్స్ మెచ్చుకుంటున్నారు. గతంలో కూడా ఈ యువ క్రికెటర్ పలు సందర్భాల్లో తన సేవాదృక్పథాన్ని చాటుకున్నాడు. తాను మొదలుపెట్టిన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని సామాజిక సేవాకార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాడు. చిన్న వయసులోనే పంత్ పెద్ద మనసుతో ముందుకెళుతున్నాడంటూ ప్రశంసలు వస్తున్నాయి.