టీమిండియాకు షాక్ మెగాటోర్నీ నుంచి పంత్ ఔట్ ?

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్ చేరుకున్న గంటల వ్యవధిలోనే టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. వార్మప్ మ్యాచ్ లేకపోవడంతో నెట్ ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడుపుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 18, 2025 | 04:10 PMLast Updated on: Feb 18, 2025 | 4:10 PM

Panth Out Of The Shock Megatournament For Team India

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్ చేరుకున్న గంటల వ్యవధిలోనే టీమిండియా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. వార్మప్ మ్యాచ్ లేకపోవడంతో నెట్ ప్రాక్టీస్ లో బిజీబిజీగా గడుపుతోంది. ఇంగ్లాండ్ తో సిరీస్ ద్వారా టచ్ లోకి వచ్చిన రోహిత్ , కోహ్లీ తమ బలహీనతలపై ఫోకస్ పెట్టగా.. బౌలర్లు కూడా తమ లైన్ అండ్ లెంగ్త్ కంటిన్యూ చేయడంపై దృష్టి పెట్టారు. అయితే నెట్ ప్రాక్టీస్ సందర్భంగా భారత్ కు బిగ్ షాక్ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్ లో గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పంత్ మోకాలికి గాయం అయింది. దీంతో భారత జట్టు తీవ్ర ఆందోళనకు గురవుతుంది.

ఆదివారం జరిగిన ఈ ప్రాక్టీస్ సెషన్ లో హార్దిక్ పాండ్యా కొట్టిన ఒక షాట్ పంత్ మోకాలికి బలంగా తగిలినట్టు సమాచారం. బంతి తగలగానే ఈ వికెట్ కీపర్ నొప్పితో విలవిల్లాడాడు. ఫిజియోథెరపిస్టుల సహాయంతో పంత్ ఇబ్బంది పడుతూనే డ్రెస్సింగ్ రూమ్ కు చేరుకున్నాడు. సొంత సమయం తర్వాత పంత్ అసౌకర్యంగా కనిపించాడు. గాయం తీవ్రతపై ఎలాంటి అప్ డేట్ లేదు. మ్యాచ్ ను టర్న్ చేయగల పంత్ కు గాయం కావడంతో టీమిండియాకు ఆందోళన కలిగించే విషయమే. ప్రస్తుతం భారత జట్టులో కీపింగ్ బాధ్యతలు కెఎల్ రాహుల్ కే అప్పగిస్తున్నారు. మెగాటోర్నీకి ముందు దీనిపై కోచ్ గంభీర్ కూడా క్లారిటీ ఇచ్చాడు. ప్రధాన వికెట్ కీపర్ గా రాహుల్ కే ప్రాధాన్యత ఉంటుందన్నాడు. కానీ పంత్ కు కూడా అవకాశాలు వస్తాయని, అతను సిద్ధంగా ఉండాలని కూడా చెప్పుకొచ్చాడు.27 ఏళ్ల రిషభ్‌ పంత్‌ తొలిసారిగా చాంపియన్స్‌ ట్రోఫీ జట్టుకు ఎంపికయ్యాడు.

అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ జట్టులోనూ అతడికి స్థానం ఉన్నా.. ప్లేయింగ్‌ ఎలెవన్‌లో మాత్రం చోటు దక్కలేదు. సీనియర్‌ కేఎల్‌ రాహుల్‌కు ప్రాధాన్యం ఇచ్చిన గంభీర్ మూడు వన్డేల్లోనూ అతడినే ఆడించాడు. దీంతో చాంపియన్స్‌ ట్రోఫీ తుదిజట్టులోనూ పంత్‌కు అవకాశం రాదనే సంకేతాలు ఇచ్చినట్లయింది. అంతేకాదు.. కేఎల్‌ రాహుల్‌కు వన్డేల్లో ఉన్న రికార్డు దృష్ట్యా అతడినే ఈ ఐసీసీ టోర్నీ ఆసాంతం ఆడించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వికెట్ కీపర్ గా.. రిజర్వ్ బ్యాటర్ గా పంత్ ఒక్కడే భారత జట్టులో ఉన్నాడు. జట్టులో ఎవరు గాయపడ్డా.. ఫామ్ లో లేకపోయినా పంత్ తప్ప మరో ఆప్షన్ లేదు. దీంతో పంత్ కోలుకోకపోతే భారత్ కు ఎదురు దెబ్బ తగిలినట్టే. పంత్ దూరమైతే స్టాండ్ బై ప్లేయర్స్ జాబితాలో దూబే ఒక్కడే బ్యాటర్ గా ఉన్నాడు. జైశ్వాల్ కూడా గాయంతో ఇబ్బంది పడుతుండడంతో బీసీసీఐ ఏం చేస్తుందనేది చూడాలి.