ఇదేమైనా టెస్ట్ మ్యాచ్ అనుకున్నావా ? హార్థిక్ పై పార్థివ్ పటేల్ ఫైర్
ఇంగ్లాండ్ తో అయిదు టీ ట్వంటీల సిరీస్ ఆసక్తికరంగా మారింది. తొలి రెండు మ్యాచ్ లు గెలిచిన భారత్ కు మూడో టీ ట్వంటీలో ఇంగ్లాండ్ షాక్ ఇచ్చింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది.
ఇంగ్లాండ్ తో అయిదు టీ ట్వంటీల సిరీస్ ఆసక్తికరంగా మారింది. తొలి రెండు మ్యాచ్ లు గెలిచిన భారత్ కు మూడో టీ ట్వంటీలో ఇంగ్లాండ్ షాక్ ఇచ్చింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది. ఈ మ్యాచ్‌లో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. కీలక సమయంలో హిట్టింగ్ చేయలేకపోయాడు. హిట్టింగ్ చేసేందుకు ఇబ్బందులు పడ్డాడు. ఈ మూడో టీ20లో టాపార్డర్ విఫలమైంది. అయితే, కీలక సమయంలో హార్దిక్ పాండ్య, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ హిట్టింగ్ చేయకుండా నిదానంగా ఆడారు. బౌండరీలు ఎక్కువగా బాదలేకపోయారు. దీంతో టీమిండియా ఒత్తిడిలో కూరుకుపోయి.. చివరికి కనీసం పోరాడినట్టు కనిపించలేదు. ముఖ్యంగా తొలుత హార్దిక్ దూకుడు ఆడలేక తడబడ్డాడు. ఈ విషయంపై హార్దిక్ ఆటతీరును భారత మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ తప్పుపట్టాడు.
ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా 35 బంతుల్లో 40 పరుగులే చేశాడు. ఓ దశలో 24 బంతుల్లో కేవలం 21 రన్స్ వద్దే ఉన్నాడు. సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతున్నా అందుకు తగ్గట్టుగా హిట్టింగ్ చేయలేకపోయాడు. దీనిపై పార్థివ్ పటేల్ మాట్లాడాడు. టీ20 మ్యాచ్‌లో సెట్ అయ్యేందుకు ఎవరూ 25 బంతుల వరకు తీసుకోకూడదన్నాడు. కనీసం స్ట్రైక్ అయినా రొటేట్ చేస్తుండాలన్నాడు. 35 బంతుల్లో హార్దిక్ 40 పరుగులు చేసి ఉండొచ్చనీ,. కానీ బ్యాటింగ్‌కు దిగిన మొదట్లో అతడు చాలా డాట్ బాల్స్ ఆడాడని గుర్తు చేశాడు . మరోవైపు టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ సరిగా లేదని, ఆ విషయంలో తప్పు చేసిందని ఇంగ్లండ్ మాజీ స్టార్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. జురెల్‌ను ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. జురెల్‌ను వేస్ట్ చేశారన్నాడు. జురెల్‌ను చివర్లో పంపడం సరికాదని పీటర్సన్ చెప్పాడు. లెఫ్ట్, రైట్ కాంబినేషన్ అనేది టాప్-4కు సరైనదే అని, కానీ ఆ తర్వాత బెస్ట్ బ్యాటర్ల ప్రకారమే ఆర్డర్ ఉండాలని పార్థివ్ పేటేల్ చెప్పాడు. జురెల్ ఓ ప్రాపర్ బ్యాటర్ అని, పెద్ద ఇన్నింగ్స్ ఆడగలడన్నాడు.