Pathan : 8ఏళ్ల తర్వాత భార్యను చూపించిన పఠాన్.. హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ కాదు..
క్రికెట్‌కు రిటైర్మెంట్ (Cricket Retirement) ప్రకటించిన పఠాన్.. క్రికెట్ మాత్రం వదలలేదు. ప్రస్తుతం కామెంటరీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కామెంటేటర్‌గా ఎంత యాక్టివ్‌గా ఉంటాడో.. సోషల్ మీడియాలోనూ అదే లెవల్ యాక్టివ్‌గా ఉంటాడు ఇర్ఫాన్. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తుంటాడు.
ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan).. క్రికెట్ (Cricket) తెలిసినవాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఇన్‌స్వింగ్‌తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించి.. ఆ తర్వాత బ్యాట్‌తోనూ సత్తా చాటి.. ఓ స్టేజీలో వాల్డ్ నంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా నిలిచాడు.
క్రికెట్‌కు రిటైర్మెంట్ (Cricket Retirement) ప్రకటించిన పఠాన్.. క్రికెట్ మాత్రం వదలలేదు. ప్రస్తుతం కామెంటరీ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. కామెంటేటర్‌గా ఎంత యాక్టివ్‌గా ఉంటాడో.. సోషల్ మీడియాలోనూ అదే లెవల్ యాక్టివ్‌గా ఉంటాడు ఇర్ఫాన్. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తుంటాడు. అన్న యూసుఫ్ పఠాన్ పిల్లలతో ఆడుకున్న ఫొటోలు, వీడియోలు.. తన తండ్రితో గడిపిన క్షణాలను అభిమానులు చూపిస్తూ ఉంటాడు. ఐతే ఇర్ఫాన్ పఠాన్ భార్య ఎవరు అని తెలుసు కానీ.. ఎలా ఉంటుంది అని ఇప్పటివరకు అభిమానులకు తెలియదు. ఫర్ ది ఫస్ట్ టైమ్.. అదీ ఎనిమిదేళ్ల తర్వాత.. భార్య ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు ఇర్ఫాన్. ఎట్టకేలకు తన అందమైన భార్యను ప్రపంచానికి పరిచయం చేశాడు.
తమ ఎనిమిదవ మ్యారేజీ యానివర్సరీ సందర్భంగా.. భార్యతో కలిసి ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కొన్ని ఎమోషనల్ కామెంట్స్ పెట్టాడు. నా ప్రాణమైన నువ్ అనేక బాధ్యతలు చేపడుతున్నావ్.. నన్ను ఎప్పుడూ ఆనందంగా ఉంచే భార్యగానే కాదు… పిల్లల ఆలనాపాలన చూసుకునే తల్లిగా.. మంచి స్నేహితురాలిగా వ్యవహరిస్తున్నావ్.. నీతో జర్నీ అద్భుతంగా ఉంది.. నువ్ నా భార్యగా రావడం గర్వంగా ఫీల్ అవుతున్నానంటూ భార్య సఫా భేగ్‌కు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపాడు ఇర్ఫాన్. ఈ ఫొటోను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. బాబీ ఎంత అందంగా ఉన్నారు అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. హీరోయిన్లకు ఏ మాత్రం తక్కువ కాని అందం అంటూ ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు.
దీంతో ఈ ఫొటో కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇర్ఫాన్ భార్య పేరు సఫా భేగ్. వీళ్ల అమ్మనాన్నలు సౌదీలో ఉంటారు. అక్కడ వాళ్లకు పెద్దపెద్ద వ్యాపారాలు ఉన్నాయ్. ఇర్ఫాన్ పఠాన్, సఫా పరిచయం 2014లో జరిగింది. కొంతకాలం ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. 2016లో పెళ్లి చేసుకున్న వీరికి ప్రస్తుతం ఓ కొడుకు ఉన్నాడు. ఇంట్రస్టింగ్ విషయం ఏంటంటే.. ఇర్ఫాన్, సఫా మధ్య ఏజ్ గ్యాప్ పదేళ్లు. ఐనా సరే వీళ్లు చాలా అన్యోన్యంగా ఉంటారు.