NZ vs NED: బ్యాటర్‌కు చేతులు జోడించి నమస్కరించిన బౌలర్
ఇన్నింగ్స్ 39వ ఓవర్లో డచ్ పేసర్ వాన్ మీకెరెన్ వేసిన బంతిని మిచెల్ బలంగా కొట్టాడు. బంతి నేరుగా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లోని స్టంప్‌లను గిరాటేసింది. బంతి కళ్లు మూసి తెరిచే లోపు స్టంప్‌లను తాకింది. ఇది చూసిన మీకెరెన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
NZ vs NED: సోమవారం హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కివీస్ బ్యాటర్ డారెల్ మిచెల్ మెరుపు షాట్ ఆడాడు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో డచ్ పేసర్ వాన్ మీకెరెన్ వేసిన బంతిని మిచెల్ బలంగా కొట్టాడు. బంతి నేరుగా నాన్ స్ట్రైకర్ ఎండ్‌లోని స్టంప్‌లను గిరాటేసింది. బంతి కళ్లు మూసి తెరిచే లోపు స్టంప్‌లను తాకింది. ఇది చూసిన మీకెరెన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు.
బంతి తనకు తాకనందుకు పేసర్ వాన్ మీకెరెన్ సంతోషించాడు. అందుకే బ్యాటర్ డారెల్ మిచెల్‌కు చేతులు జోడించి నమస్కరించాడు. ఇది చూసిన మిచెల్ పర్లేదు అన్నట్లు ఓ రియాక్షన్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్స్.. మీకెరెన్ చేసిన పని అద్భుతం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఐసీసీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ‘నన్ను కొట్టనందుకు ధన్యవాదాలు’ అని క్యాప్షన్ ఇచ్చింది.