Shikhar Dhawan: ధావన్ రాకతో పంజాబ్ పటిష్టం! ఇంగ్లీష్ ఆల్ రౌండర్ మెరుస్తాడా?
శిఖర్ ధావన్ భుజం గాయం కారణంగా చివరి గేమ్‌కు దూరమయ్యాడు. అతని గైర్హాజరీలో సామ్ కరన్ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. లివింగ్‌స్టోన్ ఐపీఎల్-2023లో ఇప్పటివరకు ఒక్క ప్రదర్శన కూడా చేయలేదు. పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పోరుకు కొన్ని గంటల ముందు వీరిద్దరూ ఫిట్‌నెస్ టెస్ట్‌లు చేయించుకోనున్నారు.

Shikhar Dhawan: శిఖర్ ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్ ఇద్దరి ఫిట్‌నెస్ అప్‌డేట్ కోసం పంజాబ్ కింగ్స్ జట్టు ఆతృతగా ఎదురుచూస్తోంది. శిఖర్ ధావన్ భుజం గాయం కారణంగా చివరి గేమ్‌కు దూరమయ్యాడు. అతని గైర్హాజరీలో సామ్ కరన్ నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు.
లివింగ్‌స్టోన్ ఐపీఎల్-2023లో ఇప్పటివరకు ఒక్క ప్రదర్శన కూడా చేయలేదు. పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పోరుకు కొన్ని గంటల ముందు వీరిద్దరూ ఫిట్‌నెస్ టెస్ట్‌లు చేయించుకోనున్నారు. లియామ్ లివింగ్‌స్టోన్ విషయానికొస్తే.. అతను ఇంకా ఈ సీజన్‌లో ఇప్పటిదాకా పాల్గొనలేదు. ఈ ఇంగ్లీష్ ఆల్ రౌండర్ గత వారం మాత్రమే జట్టులో చేరాడు. అయితే, అతను గత వారం పంజాబ్ కింగ్స్ శిక్షణలో కండరాలు లాగడంతో జట్టులో చేరిక మరింత ఆలస్యం అయింది. అతని ఫిట్‌నెస్ పరీక్ష కూడా ఆర్సీబీతో జరిగే క్లాష్‌కి ముందు ఆసక్తికరంగా మారింది.
ధావన్ లేనప్పటికీ, పంజాబ్ కింగ్స్ చివరిసారి లక్నో సూపర్ జెయింట్‌పై గట్టిపోటీతో విజయం సాధించింది. ఎకానా స్టేడియంలో షారుఖ్ ఖాన్ చక్కటి ప్రదర్శనలో తుది మెరుగులు దిద్దగా, సికందర్ రజా చక్కటి అర్ధ సెంచరీ సాధించాడు. ఇప్పుడు పంజాబ్ జట్టు మునుపటి కంటే, చాల స్ట్రాంగ్‌గా ఉంది. ఈరోజు జరగబోయే మ్యాచులో ఆర్సీబీకి గట్టిపోటీ ఉండనుంది.