IPL 2023: ఐపీఎల్ లో ప్లేఆఫ్ పోరు.. ఎవరి స్థానం ఏంటి..
IPL 2023 లీగ్ చివరి దశకు చేరుకుంది. టీమ్స్ మధ్య ప్లేఆఫ్స్ రేసు ఓ రేంజ్‌లో కొనసాగుతోంది. ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో ప్రతీ మ్యాచ్, ప్రతీ పాయింట్ చాలా ఇంపార్టెంట్. దీంతో మ్యాచ్ విన్నింగ్ మీదే కాదు.. రన్‌రేట్ మీద కూడా కాన్సట్రేట్ చేస్తున్నాయి టీమ్స్. దాదాపు అన్ని టీమ్స్ ఇంకా ఒకటో రెండో మ్యాచ్‌లు మాత్రమే ఆడాల్సి ఉంది. సన్‌రైజర్స్‌పై విక్టరీతో టాప్‌లీడ్‌లో కొనసాగుతున్న గుజరాత్.. 18 పాయింట్లతో అఫిషియల్‌గా ప్లేఆఫ్స్‌కు చేరింది. మొత్తం పది టీమ్స్ ఆడే ఐపీఎల్‌లో మొదటి నాలుగు స్థానాల్లో నిలిచే టీమ్స్ ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయి. ఇందులో మొదటి రెండు స్థానాలా చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడ ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. దీంతో ప్లేఆఫ్స్‌లో నిలిచే టీమ్స్ టాప్ 2లో నిలిచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తాయి.
ఈ సీజన్‌లోనూ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ.. ప్లేఆఫ్స్‌లో చేరిన తొలి జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఈ టీమ్ బెంగళూరుతో ఇంకా ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లోనూ ఆర్బీబీపై గెలిస్తే ముంబైతో ఆడే మ్యాచ్ రిజల్ట్‌తో సంబంధం లేకుండా టాప్-1లోనే కొనసాగుతుంది. 15 పాయింట్లతో లీడ్ బోర్డ్‌లో సెకండ్ పొజిషన్‌లో ఉన్న టీం చెన్నై సూపర్ కింగ్స్. లాస్ట్ మ్యాచ్‌లో కోల్‌కతాతో ఓడిపోవడం సీఎస్‌కే మీద తీవ్ర ప్రభావం చూపింది. దీంతో లీడ్‌బోర్డ్‌లో సెకండ్ పొజిషన్‌లో నిలిచే చాన్సెస్ 37 పర్సెంట్ తగ్గాయి. చివరి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్ బెర్త్ కన్ఫాం అవుతుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో ఓడితే మిగతా టీమ్స్ ఫలితాలపై చెన్నై భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
అప్పుడు, ముంబయి, లఖ్‌నవూ, బెంగళూరుతో పోటీ పడాల్సి ఉంటుంది. ప్రస్తుతం 14 పాయింట్లతో ఉన్న ముంబై.. లక్నో, సన్‌రైజర్స్‌తో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ టీం లీడ్‌బోర్డ్‌లో థర్డ్ ప్లేస్ దక్కించుకునే చాన్స్ ఉంది. నెక్స్ట్ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే 18 పాయింట్లతో క్వాలిఫయర్ 1లోనే ప్లేస్‌ను దక్కించుకునే అవకాశం ఉంది. రెండూ ఓడిపోతే.. కింద ఉన్న ఇతర టీమ్స్ ముంబైని అధిగమిస్తాయి. ప్లేఆఫ్స్ బెర్త్ కోసం ఇతర జట్లతో పోటీపడాల్సి ఉంటుంది. ఒక్కటి గెలిచినా.. ముంబైకి చాన్స్ ఉంటుంది. 13 పాయింట్స్‌తో ఉన్న లక్నో సూపర్ గెయింట్స్.. ముంబై, కోల్‌కతాతో ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.
ఈ రెండింటిలో లఖ్‌నవూ ఓడిపోతే.. ప్లేఆఫ్స్ అవకాశాల కోసం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచ్‌లో గెలిచినా.. ఆర్‌ఆర్, కేకేఆర్‌లు ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంటాయి. ఒకవేళ చెన్నై, ముంబయి చివరి మ్యాచ్‌ల్లో ఓడి.. లఖ్‌నవూ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే.. 17 పాయింట్లతో టాప్ 2లో పొజిషన్‌లో నిలిచే అవకాశం ఉంటుంది. సన్‌రైజర్స్,. హైదరాబాద్‌తో ఆడాల్సిన బెంగళూరు ప్రస్తుతం 12 పాయింట్స్‌తో ఉంది. ఆర్సీబీ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తేనే ప్లేఆఫ్స్ రేసులో నిలుస్తుంది.
ఒక్క మ్యాచ్‌లోనే గెలిస్తే.. 14 పాయింట్లతో మిగతా టీమ్స్‌తో పోటీ పడాల్సి ఉంటుంది. ఇక 12 పాయింట్స్‌తో ఉన్న పంజాబ్‌కు.. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవడంతో పాటు ఇతర టీమ్స్ ఫలితాలు కూడా కలిసి రావాలి. పాయింట్స్ టేబుల్‌లో చివరి రెండు స్థానాల్లో ఉన్న హైదరాబాద్, ఢిల్లీ.. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగాయి. రాజస్థాన్, కోల్‌కతా ఒక్కో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఒకేవేళ ఈ మ్యాచ్‌లలో గెలిచినా వేరే టీమ్స్ పాయింట్స్ మీద ప్రభావం చూపిస్తాయే తప్ప.. ప్లేఆఫ్స్‌లో చేరడం దాదాపు కష్టమే.