Nicholas Pooran : పూరన్ కు పూనకం వచ్చింది… స్టేడియం అవతల పడ్డ బంతి

లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ (Nicholas Pooran) తన జోరును కొనసాగిస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 3, 2024 | 01:20 PMLast Updated on: Apr 03, 2024 | 1:20 PM

Pooran Got The Ball The Ball Fell Beyond The Stadium

లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Supergiants) విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ (Nicholas Pooran) తన జోరును కొనసాగిస్తున్నాడు. గ్రౌండ్ లో తానుంటే పూన‌కాలేన‌ని నిరూపించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) తో జరిగిన మ్యాచ్‌లో పూరన్ భారీ సిక్సర్ బాదాడు. అతను కొట్టిన 106 మీటర్ల సిక్సర్‌కు బంతి స్టేడియం బయట పడింది. ప్రస్తుతం ఈ సిక్సర్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆర్‌సీబీ బౌలర్ రీస్ టోప్లీ వేసిన 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ నాలుగో బంతిని రీస్ టోప్లీ ఫుల్‌టాస్‌గా వేయగా.. పూరన్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. అతని ధాటికి బంతి స్టేడియం బయట 106 మీటర్ల దూరంలో పడింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే భారీ సిక్సర్.

19వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లు బాదుతూ తన పవర్ హిట్టింగ్ ప‌వ‌ర్ రుచిని చూపించాడు. మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) వేసిన చివరి ఓవర్లో కూడా పూర‌న్ సిక్సర్ల మోత మోగించాడు. ఈ మ్యాచ్‌లో పూరన్ 21 బంతుల్లో 5 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. 3 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద నికోలస్ పూరన్ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను వికెట్ కీపర్ అనూజ్ రావత్ వదిలేసాడు. ఈ అవకాశంతో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగి లక్నో సూపర్ జెయింట్స్‌కు పోరాడే లక్ష్యాన్ని అందించాడు. కాగా ఈ మ్యాచ్ లో బెంగుళూరు 28 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఆర్‌సీబీ 19.4 ఓవర్లలో 153 పరుగులకు కుప్పకూలింది.