Rameshbabu Praggnanandhaa: భళా ప్రజ్ఞా.. ఆనంద్‌ను దాటేసిన ప్రజ్ఞానంద
ఫిడే ర్యాంకింగ్స్‌లో విశ్వనాథన్ ఆనంద్‌ను దాటి.. భారత టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్ నాలుగో రౌండ్‌లో.. చైనాకు చెందిన వాల్డ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి ఈ ఘనత సాధించాడు.
Rameshbabu Praggnanandhaa; గతంలో అయినా.. ఇప్పుడు అయినా.. భవిష్యత్‌లో చర్చించుకున్నప్పుడు అయినా.. చదరంగం అంటే టక్కున గుర్తొచ్చే పేరు.. విశ్వనాథన్ ఆనంద్. చెస్‌లో గ్రాండ్ మాస్టర్ హోదాను ప్రతిష్ఠాత్మకంగా భావిస్తుంటారు. అలాంటి గొప్ప ఘనతను సాధించిన తొలి భారతీయుడుగా విశ్వనాథన్ ఆనంద్ రికార్డ్ క్రియేట్ చేశాడు. ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలని ప్రతీ ఒక్క చెస్ ప్లేయర్ ఆశపడుతుంటాడు. అలాంటిది ఆనంద్.. ప్రపంచాన్ని జయించడం, ప్రపంచ విజేతగా నిలవడం పెద్ద మ్యాటరే కాదు అన్నట్లుగా.. ఏకంగా అయిదు సార్లు వాల్డ్ చాంపియన్‌గా నిలిచాడు.
Lakshadweep: లక్షద్వీప్ లక్ష్యం పర్యాటకమే కాదు.. మోదీ తిరుగులేని ప్లాన్..
ఐతే అలాంటి చెస్ దిగ్గజాన్ని భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద అధిగమించాడు. ఫిడే ర్యాంకింగ్స్‌లో విశ్వనాథన్ ఆనంద్‌ను దాటి.. భారత టాప్ ర్యాంకర్‌గా నిలిచాడు. టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నమెంట్ నాలుగో రౌండ్‌లో.. చైనాకు చెందిన వాల్డ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి ఈ ఘనత సాధించాడు. ఈ విక్టరీతో ప్రజ్ఞానంద ఫిడే పాయింట్లను భారీగా మెరుగు పరుచుకున్నాడు. 2748.3 పాయింట్లతో 11వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. మరోవైపు దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ 2748 పాయింట్లతో 12వ స్థానంలో ఉన్నాడు. ప్రజ్ఞానంద మరో ఘనత అందుకున్నాడు. క్లాసికల్ చెస్ విభాగంలో ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించిన రెండో ఇండియన్ ప్లేయర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. గతంలో ఈ రికార్డు విశ్వనాథన్ ఆనంద్ పేరిట మాత్రమే ఉండేది. గతేడాది జరిగిన చెస్ ప్రపంచకప్‌లో ప్రజ్ఞానంద రన్నరప్‌గా నిలిచాడు. దిగ్గజ ఆటగాడు కార్ల్‌సన్‌కు గట్టి పోటీనిచ్చి.. టైటిల్‌ను తృటిలో కోల్పోయాడు.
తొలిరౌండ్, తొలిగేమ్‌లో ప్రజ్ఞానందపై విజయం సాధించి.. రెండో గేమ్‌ను డ్రాగా ముగించి కార్ల్‌సన్ ఛాంపియన్‌గా నిలిచాడు. అయితే విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫిడే చెస్ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరుకున్న భారత ఆటగాడిగా ప్రజ్ఞానంద హిస్టరీ క్రియేట్ చేశాడు. ప్రపంచకప్‌లో ఫైనల్ ఆడిన అత్యంత చిన్న వయస్కుడైన ఆటగాడిగానూ ప్రజ్ఞానంద మరో ఘనత సాధించాడు. ఈ కుర్రాడి మీద యావత్ దేశం ఇప్పుడు ప్రశంసలు గుప్పిస్తోంది. తనను చూసి గర్వంగా ఉందని అభినందిస్తోంది.