Jaishwal : మీకో దండం జైశ్వాల్‌ను వదిలేయండి

విశాఖ టెస్టు(Visakha Test) లో డబుల్‌ సెంచరీతో అదరగొట్టిన టీమిండియా (Team India) యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashaswi Jaiswal) పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 4, 2024 | 02:35 PMLast Updated on: Feb 04, 2024 | 2:35 PM

Praise For Team Indias Young Opener Yashaswi Jaiswal Who Scored A Double Century In Visakhapatnam Test

విశాఖ టెస్టు(Visakha Test) లో డబుల్‌ సెంచరీతో అదరగొట్టిన టీమిండియా (Team India) యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (Yashaswi Jaiswal) పై ప్రశంసల వర్షం కురుస్తోంది. టెస్టుల్లో టీమిండియా తరఫున డబుల్ సెంచరీ చేసిన మూడో అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. దీంతో పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు జైశ్వాల్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా (Akash Chopra) అయితే సర్‌ బ్రాడ్‌మన్‌తో పోలుస్తూ ఆకాశానికెత్తాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓవర్‌హైప్‌ క్రియేట్‌ చేసి అతడిపై ఒత్తిడి పెంచవద్దని అభిమానులు, మీడియాకు విజ్ఞప్తి చేశాడు.

ప్రముఖ వార్తా సంస్థ పీటీఐతో మాట్లాడిన గంభీర్ చిన్న వయసులోనే అరుదైన రికార్డులు సాధిస్తున్న యశస్వికి శుభాకాంక్షలు చెప్పాడు. అయితే అతడు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడనీ, స్వేచ్ఛగా ఆడనివ్వాలని కోరాడు. భారత్‌లో మీడియాకు ఓ అలవాటుందన్న గంభీర్ ఆటగాళ్ల విజయాలను అతి చేసి చూపించి.. వారికి ఏదో ఒక ట్యాగ్‌ అంటగట్టి… హీరోలను చేస్తుందన్నాడు. ఇలాంటి ప్రచారం వల్ల ఆటగాళ్లపై ఒత్తిడి పెరుగిపోతుందని, ఆ ఒత్తిడిలో తమదైన ఆటను మర్చిపోతారన్నాడు.