Preity Zinta: రోహిత్ శర్మ చేతికి పంజాబ్ పగ్గాలు.. ప్రీతిజింతా ఏం చెప్పిందంటే..?

వ‌చ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో రోహిత్‌ను కొనేందుకు పంజాబ్‌, గుజ‌రాత్‌తో పాటు ఇత‌ర ఫ్రాంచైజ్‌లు రెడీ ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా రోహిత్‌ను వేలంలో ద‌క్కించుకునేందుకు ప్రీతిజింతా తెగ ఇంట్రెస్ట్ చూపుతున్న‌ట్లు మీడియాలో వార్త‌లు వచ్చాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 20, 2024 | 05:58 PMLast Updated on: Apr 20, 2024 | 5:58 PM

Preity Zinta Issues Stern Statement On Viral Rohit Sharma As Pbks Captain

Preity Zinta: ఐపీఎల్ 17వ సీజన్ ఆరంభానికి ముందు రోహిత్‌ను కాద‌ని హార్దిక్ పాండ్య‌కు ముంబై టీమ్ మేనేజ్‌మెంట్ కెప్టెన్సీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించింది. కెప్టెన్సీ మార్పుపై రోహిత్ చాలా హ‌ర్ట్ అయిన‌ట్లు ముంబై జ‌ట్టును వీడ‌నున్న‌ట్లు కొన్నాళ్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఐపీఎల్‌లో ముంబై త‌ర‌ఫున ఇదే అత‌డికి చివ‌రి సీజ‌న్ అంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి.

MS DHONI: మాస్.. ఊర మాస్.. ధోనీ ధనాధన్ బ్యాటింగ్

వ‌చ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో రోహిత్‌ను కొనేందుకు పంజాబ్‌, గుజ‌రాత్‌తో పాటు ఇత‌ర ఫ్రాంచైజ్‌లు రెడీ ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ముఖ్యంగా రోహిత్‌ను వేలంలో ద‌క్కించుకునేందుకు ప్రీతిజింతా తెగ ఇంట్రెస్ట్ చూపుతున్న‌ట్లు మీడియాలో వార్త‌లు వచ్చాయి. వచ్చే సీజ‌న్‌లో పంజాబ్ కెప్టెన్‌గా శిఖ‌ర్ ధావ‌న్‌ను త‌ప్పించ‌డం ఖాయ‌మేన‌ని పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే ఈ పుకార్ల‌పై ట్విట్ట‌ర్ ద్వారా ప్రీతిజింతా క్లారిటీ ఇచ్చింది. రోహిత్‌ను ఐపీఎల్ వేలంలో తాను ద‌క్కించుకోవ‌డాకి సిద్ధ‌మంటూ కామెంట్స్ చేసిన‌ట్లు జ‌రుగుతోన్న ప్ర‌చారంలో నిజం లేద‌ని స్పష్టం చేసింది. రోహిత్ గురించి తాను ఏ ఇంట‌ర్వ్యూలో ఎలాంటి కామెంట్స్ చేయ‌లేద‌ని, ఎలాంటి స్టేట్‌మెంట్స్ ఇవ్వ‌లేద‌ని వెల్ల‌డించింది.

రోహిత్ వీరాభిమానుల్లో తాను ఒక‌రిన‌ని, అత‌డి ఆట‌తీరు అంటే చాలా ఇష్ట‌మ‌ని ఈ సొట్ట బుగ్గల సుందరి చెప్పుకొచ్చింది. కెప్టెన్‌గా, ఆట‌గాడిగా శిఖ‌ర్ ధావ‌న్‌పై న‌మ్మ‌కం, గౌర‌వం ఉన్నాయ‌ని ప్రీతిజింతా వ్యాఖ్యానించింది. ధావ‌న్ గాయంతో జ‌ట్టుకు దూర‌మైన త‌రుణంలో ఇలాంటి పుకార్ల‌ను సృష్టించ‌గం త‌గ‌ద‌ని, ఈ నిరాధార‌మైన కథ‌నాలు జ‌ట్టు ఆత్మ‌స్థైర్యాన్ని దెబ్బ‌తీస్తాయ‌ని ప్రీతి జింటా తెలిపింది. ఆమె చేసిన ఈ పోస్ట్ ట్విట్ట‌ర్‌లో వైర‌ల్ అవుతోంది.