కోహ్లీ టీమ్ కే ఆడతా సిక్సర్ల వీరుడి కామెంట్స్
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో పలువురు యువ ఆటగాళ్ళు పరుగుల వరద పారిస్తున్నారు. ఐపీఎల్ మెగా వేలం ముంగిట తమకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ చెలరేగిపోతున్నారు.

ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో పలువురు యువ ఆటగాళ్ళు పరుగుల వరద పారిస్తున్నారు. ఐపీఎల్ మెగా వేలం ముంగిట తమకు వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటూ చెలరేగిపోతున్నారు. తాజాగా ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు కొట్టిన ప్రియాన్స్ ఆర్య ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయాడు. యువరాజ్ తర్వాత ఈ ఘనత సాధించిన ప్లేయర్ గా రికార్డ్ సృష్టించాడు. 39 బంతుల్లోనే సెంచరీ చేసుకున్న ప్రియాంష్.. 50 బంతుల్లో 120 పరుగులు చేసి ఔటయ్యాడు.ఎవ్వరూ ఊహించని విధంగా ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన ప్రియాన్స్ తర్వాతి టార్గెట్ ఐపీఎల్ ఆడడమేనని తెలుస్తోంది. తాజాగా దీనిపై ప్రశ్నించినప్పుడు ప్రియాన్ష్ విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీకి ఆడాలని ఉందని మనసులో మాట బయటపెట్టాడు.
కోహ్లీ తన అభిమాన క్రికెటర్ గా చెప్పిన ఈ యంగ్ ప్లేయర్ ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలిచేందుకు తన వంతు కృషి చేస్తానంటున్నాడు. అవకాశం వస్తే బెంగళూరు జట్టుకే ఆడతానని చెప్పాడు. ప్రియాంష్ ఆర్య ఐపీఎల్ ఆక్షన్ లోకి వస్తే జాక్ పాట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ యంగ్ క్రికెటర్ ను కొనేందుకు పలు ఫ్రాంచైజీలు ఆసక్తిగా ఉన్నట్టు సమాచారం. కాగా ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు టైటిల్ గెలవాలనే కల ఇంకా కొనసాగుతూనే ఉంది. సీజన్ ప్రారంభంలో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగడం.. అంచానాలు అందుకోలేక బోల్తా పడడం ఆ జట్టుకు అలవాటుగా మారింది. ఈసారి మెగా వేలంలో వ్యూహాత్మకంగా వ్యవహరించి అత్యుత్తమ ప్లేయర్స్ ను తీసుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది.