PBKS vs LSG: లేజీనెస్ లక్నో ఒకవైపు.. పేకమేడల పంజాబ్ మరోవైపు
స్లోగా ఉన్న పిచ్‌పై 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎల్‌ఎస్‌జి 14 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 105 పరుగుల వద్ద పటిష్టంగా ఉండి, 36 బంతుల్లో 31 పరుగులు చేయాల్సి ఉండగా, 20 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేసింది.

PBKS vs LSG: అర్ష్‌దీప్ డెత్ బౌలింగ్ మాస్టర్ క్లాస్‌తో ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురావడానికి పంజాబ్ కింగ్స్ జట్టు, నిరంతరం పోరాడుతూ ఉంది. శామ్ కరన్ బ్యాట్‌తో ఫామ్‌లోకి రావడం పంజాబ్ జట్టుకు సానుకూలంగా ఉంది. మరోవైపు, లక్నో చివరి గేమ్ మరచిపోలేనిది.
గెలిచే స్థాయి నుంచి అనూహ్యంగా మ్యాచ్‌లో ఓడిపోయింది. ఇది ముందు జరగబోయే మ్యాచుల్లో ఆటగాళ్లపై మానసికంగా ప్రభావం చూపుతుంది. స్లోగా ఉన్న పిచ్‌పై 136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎల్‌ఎస్‌జి 14 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 105 పరుగుల వద్ద పటిష్టంగా ఉండి, 36 బంతుల్లో 31 పరుగులు చేయాల్సి ఉండగా, 20 ఓవర్ల తర్వాత 7 వికెట్ల నష్టానికి 128 పరుగులు మాత్రమే చేసింది. రెండు జట్లూ ఆల్ రౌండర్లతో నిండి ఉన్నాయి. కృనాల్ పాండ్యాతో పాటు మార్కస్ స్టోయినిస్, శామ్ కరన్ మ్యాచును మలుపు తిప్పగలరు.
ఇరు జట్లలోకూడా అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్‌లు బలమైన ముద్ర వేసే బౌలర్లుగా కొనసాగుతున్నారు. ప్రభ సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, నికోలస్ పూరన్ వంటి ఆటగాళ్లు ప్రత్యర్థి నుంచి రెప్పపాటులో ఆటను లాగేసుకునే పవర్‌హిట్టర్లు. ఇంత మంది టీ 20 స్పెషలిస్టులు ఆడబోతున్న నేటి మ్యాచు అభిమానులకు గొప్ప ఎంటర్టైన్మెంట్ అందివ్వనుంది.