King video call : క్వీన్ కు కింగ్ వీడియో కాల్
ఎట్టకేలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) అభిమానుల కల నేరవేరింది.

Queen to King video call
ఎట్టకేలకు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) అభిమానుల కల నేరవేరింది. 16 ఏళ్లుగా ఐపీఎల్‌లో పురుషుల ఫ్రాంఛైజీకి సాధ్యం కాని టైటిల్‌ను డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‌లోనే అమ్మాయిల జట్టు సాధించింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసిన ఆర్సీబీ.. తొలిసారి ట్రోఫీని ముద్దాడింది. దీంతో ఆర్సీబీ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. స్మృతి మందాన సారథ్యంలోని మహిళల జట్టును ప్రశంసలతో ముంచెత్తారు. ఆర్సీబీ (RCB) స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) సోషల్ మీడియా వేదికగా తమ మహిళల జట్టును అభినందించాడు. సూపర్ ఉమెన్ అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. అలాగే టైటిల్ గెలిచిన అనంతరం అర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన వీడియో కాల్ కూడా చేశాడు. మంధానతో పాటు మిగితా ప్లేయర్స్‌తో విరాట్ కాసేపు సంభాషించాడు. విరాట్‌ను చూడగానే ఆర్సీబీ ప్లేయర్ ఆనందంతో గంతులేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.