Quinton de Kock: డికాక్ ధీర.. వన్డే క్రికెట్‌కు ఘనమైన వీడ్కోలు..
నిన్నటి మ్యాచ్‌తో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డికాక్ తన కెరీర్ ఆఖరి మ్యాచ్‌తో వరల్డ్‌కప్ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌ల్లో 4 సెంచరీల సాయంతో 594 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి 10 మ్యాచ్‌ల్లో 711 పరుగుల తర్వాత సెకెండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు డికాక్.
Quinton de Kock: వన్డే వరల్డ్‌కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో గురువారం జరిగిన రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా 3 వికెట్ల తేడాతో ఓటమిపాలై ఐదోసారి సెమీస్ గండాన్ని దాటలేక ఇంటిబాట పట్టింది. ఈ ఎడిషన్ ప్రారంభం నుంచి అద్బుతమైన ఆటతీరు కనబర్చి, వరుస విజయాలు సాధించిన సఫారీలు.. సెమీస్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డారు. లీగ్ దశ మొత్తంలో ఇరదీసిన సౌతాఫ్రికా బ్యాటర్లు నిన్నటి నాకౌట్ మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేశారు. టోర్నీ టాప్ 10 రన్ స్కోరర్ల జాబితాలో ఉన్న డికాక్, డస్సెన్, మార్క్రమ్ ఆసీస్‌తో మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యారు.
Pak Cricketers: భారత విజయాలపై పాక్ మాజీల అక్కసు.. పరువు తీసేసుకుంటున్నారుగా..!
డికాక్ 3, డస్సెన్ 6, మార్క్రమ్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. ఆసీస్ చేతిలో సౌతాఫ్రికా ఓడినప్పటికీ.. క్వింటన్ డికాక్ మాత్రం ఓ అరుదైన ఘనత సాధించాడు. నిన్నటి మ్యాచ్‌తో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలికిన డికాక్ తన కెరీర్ ఆఖరి మ్యాచ్‌తో వరల్డ్‌కప్ రికార్డు నెలకొల్పాడు. ఈ ప్రపంచకప్‌లో 10 మ్యాచ్‌ల్లో 4 సెంచరీల సాయంతో 594 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి 10 మ్యాచ్‌ల్లో 711 పరుగుల తర్వాత సెకెండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచిన డికాక్.. ఈ ఎడిషన్‌లో 20 క్యాచ్‌లు కూడా పట్టి ప్రపంచకప్ చరిత్రలో 500 ప్లస్ పరుగులు, 20 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్ కీపర్, బ్యాటర్‌గా ఎవరికీ సాధ్యంకాని రికార్డును సాధించాడు.